AP మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ ప్రమాణస్వీకారంచేశారు. మంత్రి తానేటి వనిత పద్మతో ప్రమాణం చేయించారు. తాడేపల్లిలోని సీఎస్‌ఆర్ కల్యాణమండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సభాపతి తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు.
మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఎటువంటి పక్షపాతంగానీ.. రాగద్వేషాలు గానీ లేకుండా చిత్తశుద్ధితో తన బాధ్యలు నిర్వహిస్తానని పద్మ ప్రమాణం చేశారు.బాద్యత నిర్వహణలో భాగంగా ఎటువంటి భయాలకుగానీ..ఒత్తిడులకు గానీ తలొగ్గనన్నారు. ఎన్నో సమస్యలపై ధైర్యంగా పోరాడిన పద్మకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి దక్కడం సంతోషంగా ఉందన్నారు.
వాసిరెడ్డి పద్మ పార్టీ పెట్టినప్పటి నుంచి కొనసాగుతున్నారు. జగన్ వెన్నంటే ఉన్న నేతల్లో ఆమె కూడా ఒకరు.
పార్టీ కోసం పద్మ చేసిన సేవలను గుర్తించి.. జగన్ గౌరవనీయమైన పదవిని అప్పగించారు. గన్ తో పాటే నేను అన్నట్లుగా ఉన్న వాసిరెడ్డి పద్మ పలు సమస్యలపై ధైర్యంగా పోరాడారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి దక్కడం సంతోషంగా ఉందని వైసీపీ నేతలు ప్రశంసించారు.