కర్నూలుకు విజిలెన్స్ ఆఫీసులు: అర్థరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు

విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయం, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

కర్నూలుకు విజిలెన్స్ ఆఫీసులు: అర్థరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు

Ap Vigilance Office

Updated On : September 1, 2021 / 3:52 PM IST

విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయం, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం ఈ కార్యాలయాలు వెలగపూడిలోని సచివాలయం నుంచి పనిచేస్తుండగా.. పరిపాలన కారణాల రీత్యా వీటిని కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలను గుర్తించాల్సిందిగా కర్నూలు జిల్లా కలెక్టర్‌, రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్‌ ఇన్‌చీఫ్‌లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు విడుదల చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఈ కార్యాలయాలను తరలిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

Order