దుర్గమ్మను దర్శించుకున్న వృద్దులు
వారంతా కన్నబిడ్డలకు నిరాదరణకు గురైన వారు. కొన్ని కొన్ని కారణాలతో.. చాలా మంది వృద్ధులు అనాథాశ్రమల్లో జీవనం కొనసాగిస్తున్నారు.

వారంతా కన్నబిడ్డలకు నిరాదరణకు గురైన వారు. కొన్ని కొన్ని కారణాలతో.. చాలా మంది వృద్ధులు అనాథాశ్రమల్లో జీవనం కొనసాగిస్తున్నారు.
విజయవాడ : వారంతా కన్నబిడ్డలకు నిరాదరణకు గురైన వారు. కొన్ని కొన్ని కారణాలతో…చాలా మంది వృద్ధులు అనాథాశ్రమల్లో జీవనం కొనసాగిస్తున్నారు. పండుగలు సైతం ఇక్కడనే జరుపుకుంటుంటారు. అయితే… సంక్రాంతి పండుగ నేపథ్యంలో వీరికి బెజవాడ కనకదుర్గమ్మను దర్శింపచేయాలని బెజవాడ ఇంద్రకీలాద్రి అధికారులు అనుకున్నారు.
జనవరి 14వ తేదీ ఉదయం పలువురు వృద్ధులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి వారితో ముచ్చటించింది. దుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని.. ఈ అవకాశం కల్పించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు చెప్పారు.