విజయవాడ సీట్ కోసమేనా : వైసీపీకి ఆదిశేషగిరి రావు రాజీనామా

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 08:01 AM IST
విజయవాడ సీట్ కోసమేనా : వైసీపీకి ఆదిశేషగిరి రావు రాజీనామా

Updated On : January 8, 2019 / 8:01 AM IST

హైదరాబాదు: సార్వత్రిక ఎన్నికలకు ముందు నేతలు పార్టీలు మారుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆదిశేషగిరి రావు రాజీనామా చేశారు. కొన్ని కారణాల వల్ల తాను పార్టీలో ఇమడలేకపోతున్నట్లు ఆదిశేషగిరి రావు తెలిపారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా ఆదిశేషగిరిరావు పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణకు సోదరుడు..హీరో మహేశ్ బాబు పెదనాన అయిన ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు.ఇప్పటికే బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీ వీడిన సంగతి తెలిసిందే.విశాఖపట్నంకు చెందిన బీజేపీ కీలక నేత చెరువు రామకోటయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి..తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.  కాంగ్రెస్ పార్టీకి నాదెండ్ల మనోహర్, తెలుగుదేశం పార్టీకి రావెల కిషోర్ బాబులు కూడా గతంలోనే రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. రాజీనామాల పరంపర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా తాకింది. 

ఈ క్రమంలో చెప్పేశారు.వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు, జగన్‌కు సన్నిహితంగా మెలిగిన పార్టీకి ఘట్టమనేని ఆదిశేషగిరి రావు ఆ పార్టీకి గుడ్ బై ఈయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ సమయంలో ఇది ఇది వైసీపీకి ఊహించని షాక్ అనే చెప్పొచ్చు. కాగా..గుంటూరు లోక్ సభ స్థానం అడిగితే, జగన్ విజయవాడ లోక్ సభ స్థానం ఇచ్చేందుకు మొగ్గు చూపడం వల్లే ఆయన పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఆయనను బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు.