యాదాద్రిలో బెల్లంతో లడ్డూ ప్రసాదం

  • Published By: madhu ,Published On : May 10, 2019 / 01:39 AM IST
యాదాద్రిలో బెల్లంతో లడ్డూ ప్రసాదం

Updated On : May 28, 2020 / 3:42 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఇక నుంచి బెల్లం లడ్డూలు కూడా ప్రసాదంగా లభించనున్నాయి. ప్రస్తుత ప్రసాద లడ్డూతో పాటు బెల్లం లడ్డూను అదనంగా విక్రయించేందుకు ఆలయ యంత్రాంగం కసరత్తు చేపట్టింది. గత వారం రోజులుగా బెల్లం లడ్డూలను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. భక్తులకు, అక్కడ పనిచేసే సిబ్బందికి ఫ్రీగానే లడ్డూలను పంచి పెట్టింది. లడ్డూల రుచి, నాణ్యత ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు అక్కడి అధికారులు. 
Also Read : భారతదేశపు డివైడర్… మోడీపై టైమ్స్ వివాదాస్పద హెడ్ లైన్

ప్రస్తుతం సికింద్రబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో మాత్రమే బెల్లంతో తయారు చేసే ప్రసాద లడ్డూలను భక్తులకు పంపిణీ చేస్తున్నారు. యాదాద్రిలో కూడా బెల్లం లడ్డూలను ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో తాము దీనికి శ్రీకారం చుట్టామని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ ఈవో గీతారెడ్డి..11 మంది ఉద్యోగులతో ప్రత్యేక కమిటీని నియమించారు. ఐదుగురు ఏఈవోలు, ఇద్దరు ప్రధాన పూజారులు, మరో ఇద్దరు వంట స్వాములు, ఇద్దరు పర్యవేక్షకులున్నారు. 

లడ్డూ తయారీకి సంబంధించిన ప్రక్రియ, రుచి, నాణ్యత, పరిణామాల అంశాలను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌కు నివేదిస్తున్నట్లు ఈవో తెలిపారు. అక్కడి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే భక్తులకు ప్రసాద లడ్డూతో పాటు బెల్లం లడ్డూలను అదనపు కౌంటర్ల ద్వారా విక్రయిస్తామన్నారు. 
Also Read : మోడీకి మమత బంపరాఫర్: ఆరోపణలు నిరూపించలేకపోతే 100 గుంజీలు తియ్యాలి