షర్మిల నీ స్థాయి తెలుసుకుని మాట్లాడు

అమరావతి : వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిళపై టీడీపీ అధికార ప్రతినిథి సాధినేని యామిని విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు ని..లోకేశ్ ను విమర్శించే స్థాయి షర్మిళకు లేదనే విషయం ఆమె గుర్తుంచుకోవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు యామిని. సీఎం గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగించే భాష అభ్యంతరకరంగా ఉందనీ..ఆమె స్థాయి ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.సోదరుడు జైల్లో ఉన్నప్పుడు జగన్ ని ప్రజలు ఎక్కడ మరచిపోతారోననే భయంతో షర్మిళ పాదయాత్ర చేశారనీ..కానీ ఇప్పుడు ఆమె పాదయాత్ర చేస్తే జగన్ కు వచ్చే నాలుగు సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.
లోకేశ్ గురించి మాట్లాడే అర్హత షర్మిళకు లేదనీ ..విమర్శలు చేసేముందు నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. మంత్రిగా లోకేశ్ చేసిన అభివృద్ధి గురించి రాష్ట్రంలో ఏమూలకు వెళ్లినా కనిపిస్తాయనీ..ప్రజలు వినిపిస్తారని అన్నారు. ఈ రాష్ట్రంలో నివసిస్తు..ఈ రాష్ట్రం నీరు తాగు ఉండేవారికి ఎవరికైనా సరే ఇక్కడి అభివృద్ధి కనిపిస్తుంది తప్పా వేరే రాష్ట్రంలోఉండేవారికి..బెంగళూరులో ఉంటు అప్పుడప్పుడు ఏపీ వచ్చేవారికి..ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు.
కాగా సీఎం చంద్రబాబు..లోకేశ్ పై షర్మిళ విమర్శిస్తు..చంద్రబాబు 6 వందల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారని..ఒకప్పుడు అన్ని రకాలుగా ముందుకు పోతున్నాం అంటు సీఎం చెప్పేవన్నీ గొప్పలే తప్ప అభివృద్ధి అనేది రాష్ట్రంలో ఎక్కడా కనిపించటంలేదని షర్మిళ ఆరోపించిన విషయం తెలిసిందే.