యనమల వర్సెస్ బొత్స: టీడీపీ ఓడిపోతుంది.. అధికారులూ సహకరించకండి

  • Published By: vamsi ,Published On : April 22, 2019 / 11:03 AM IST
యనమల వర్సెస్ బొత్స: టీడీపీ ఓడిపోతుంది.. అధికారులూ సహకరించకండి

Updated On : April 22, 2019 / 11:03 AM IST

యనమల కామెంట్స్:
ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆర్ధికశాఖలో తలదూరుస్తున్నారంటూ యనమల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఎస్‌ నియామకంతో పాటు, నిర్ణయాలను ఆర్థిక మంత్రి యనమల తప్పుబట్టారు. ఆర్థిక శాఖలో వ్యవహారాలపై సీఎస్‌ సూచనలు, నిధుల సమీకరణ, విడుదలలో మంత్రివర్గ నిర్ణయమే ఫైనల్‌ అన్నారు. సీఎస్ సర్వీస్‌ రూల్స్‌ అతిక్రమిస్తున్నారని, సీఎస్‌ మంత్రివర్గానికి సబార్డినెట్‌ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
Also Read : ఏపీలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమే : గోరంట్ల

సీఎస్ మంత్రివర్గ నిర్ణయాలను ఎలా ప్రశ్నిస్తారంటూ విమర్శించారు. ఆర్థికశాఖలో ప్రాధాన్యత క్రమం లేకుండా చెల్లింపులు చేయడంపై అధికారులను సీఎస్ వివరణ కోరగా.. ఈ మేరకు సీఎస్‌పై యనమల ఫైర్ అయ్యారు.

బొత్స కౌంటర్:
ఇదే విషయంలో కేబినెట్‌ నిర్ణయానికి అధికారులు వత్తాసు పలకాలని మంత్రి యనమల చెప్పడం దారుణమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై యనమల చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని బొత్స అన్నారు. ఏపీలో జరిగినంత ఘోరమైన పాలన, అవినీతి దేశంలో ఎక్కడ చూడలేదని, ఐదేళ్ల పాలనలో చంద్రబాబు వెన్నపోటు రాజకీయాలతో వ్యవస్థలను దెబ్బతీశారని అన్నారు. టీడీపీకి డబ్బు సర్దిన వారికే ప్రభుత్వ ధనం దోచిపెట్టారని అన్నారు. కాంట్రాక్టులను తన సామాజికి వర్గం వారికే కట్టబెట్టారని విమర్శించారు. 

2014 నుంచి ఇప్పటి వరకు మాజీ సీఎస్‌లు ఐవైఆర్‌, అజయ్‌ కల్లాంలు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆర్థిఖ శాఖ కార్యదర్శి రవిచంద్ర ఎందుకు సెలవుపై వెళ్లారని ప్రశ్నించారు.  ప్రతిపక్షం కదలికలపై నిఘా కోసం పోలీస్‌ శాఖకు వేల కోట్లు కేటాయించారని అన్నారు. చంద్రబాబు యథేచ్చగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారని, నెల రోజుల్లో టీడీపీ ప్రభుత్వం దిగిపోతుందని, టీడీపీ ప్రభుత్వ అక్రమాలకు అధికారులు సహకరించడవద్దని బొత్స కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో రాగానే ప్రజాధనం దోచుకున్నవారికి శిక్ష తప్పదన్నారు. 
Also Read : చిరంజీవి ‘పవన్ శంకర్’ : అభిమాని కొడుకుకి పేరు పెట్టిన చిరు