ఒకే పేరుతో నామినేషన్.. ఆందోళనలో వైసీపీ!

  • Published By: vamsi ,Published On : March 26, 2019 / 02:39 AM IST
ఒకే పేరుతో నామినేషన్.. ఆందోళనలో వైసీపీ!

Updated On : March 26, 2019 / 2:39 AM IST

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి ఇంటిపేరుతో ఉన్న ఇద్దరు వ్యక్తులు బరిలో ఉండడంతో వైసీపీకి ఆందోళన మొదలైంది. అవును పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి మాజీ మంత్రి డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.

ఇదే సమయంలో ఒంగోలు సమీపంలోని పెళ్లూరుకు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి కూడా… ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పర్చూరు అసెంబ్లీ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. పేర్లు దాదాపు ఒకటే  కావడం.. గుర్తులు కూడా ఫ్యాన్, హెలికాఫ్టర్ గుర్తులు ఒకదానితో ఒకటి పోలి ఉండడంతో వైసీపీ నాయకులు ఓట్లు ఎక్కడ చీలుతాయో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.