విజయసాయి కామెంట్ : లోకేష్ కే పెళ్లయ్యింది.. వాలంటీర్లకు ఎందుకవ్వదు!

గ్రామ వాలంటీర్లు 5వేల రూపాయల జీతంతో పనిచేస్తే.. పెళ్లికి పిల్లను కూడా ఇవ్వటంలేదని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. మాజీ మంత్రి, మాజీ సీఎంకుమారుడు లోకేష్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు ఎంపీ.
“5 వేల వేతనంతో పనిచేసే గ్రామ వాలంటీర్లకు పిల్లను కూడా ఇవ్వరని @ncbn ఎకసెక్కాలాడుతున్నారు. అప్రయోజకుడు, అజ్ణాని, చెల్లని కాసు లాంటి మాలోకానికి పెళ్లి అవలేదా? లక్షల మందితో పోటీ పడి ఉద్యోగాలు సాధించిన వలంటీర్ సైనికులకు ఏం తక్కువని మీరలా అపశకునాలు పలుకుతున్నారు? @naralokesh అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్లు ఎన్టీఆర్ హాయాంలో నెలకు రూ.390 ఇచ్చిన టీచర్ ఉద్యోగాలగురించి, చంద్రబాబు హాయాంలో రూ.1100 లకు ఇచ్చిన అప్రెంటీస్ ఉద్యోగాల గురించి కామెంట్ చేస్తున్నారు.
5 వేల వేతనంతో పనిచేసే గ్రామ వలంటీర్లకు పిల్లను కూడా ఇవ్వరని @ncbn ఎకసెక్కాలాడుతున్నారు. అప్రయోజకుడు, అజ్ణాని, చెల్లని కాసు లాంటి మాలోకానికి పెళ్లి అవలేదా? లక్షల మందితో పోటీ పడి ఉద్యోగాలు సాధించిన వలంటీర్ సైనికులకు ఏం తక్కువని మీరలా అపశకునాలు పలుకుతున్నారు? @naralokesh
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 7, 2019