ఏపీలో ‘YSR కంటి వెలుగు’ ప్రారంభించనున్న సీఎం జగన్

  • Published By: veegamteam ,Published On : October 9, 2019 / 02:13 AM IST
ఏపీలో ‘YSR కంటి వెలుగు’ ప్రారంభించనున్న సీఎం జగన్

Updated On : October 9, 2019 / 2:13 AM IST

ఆంధప్రదేశ్ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న YSR కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం (అక్టోబర్ 10, 2019) ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగే సభలో ఈ పథకాన్ని ప్రారంభించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.

అయితే ప్రతీ ఏడాది అక్టోబర్ రెండవ గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవంగా జరుపుతారు. ఈ సందర్భంగా రేపు రాష్ట్ర ప్రజలందరికీ కంటి వెలుగు కార్యక్రమం కింద ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ, శస్త్ర చికిత్సలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమం ఆరు విడతలుగా మూడేళ్లపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఏపీ ప్రజలకు ఉచితంగా సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.