జగన్ విజయయాత్ర : వైసీపీ గెలిస్తే ఏపీలో 25 జిల్లాలు – జగన్…

  • Published By: madhu ,Published On : January 9, 2019 / 11:49 AM IST
జగన్ విజయయాత్ర : వైసీపీ గెలిస్తే ఏపీలో 25 జిల్లాలు – జగన్…

శ్రీకాకుళం : వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తామో..ఎలాంటి పనులు చేస్తామో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వివరించారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా పాతబస్టాండులో భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద..రైతుల కన్నీళ్లు తుడుస్తామని చెప్పారు. ఏపీలో ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తామని…రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామన్నారు.  ప్రతి కలెక్టర్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జవాబుదారిగా ఉండాలని..ఆ పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. అప్పుడు 25 జిల్లాల ఆంధ్రరాష్టం అవుతుందన్నారు. ప్రతి పేదవాడికి న్యాయం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు…స్థానిక నిరుద్యోగులకు సెక్రటేరియట్‌ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల్లో లంచం ఇవ్వనిదే పని కావడం లేదు….ఇంటి వద్దకే పథకం వచ్చే విధంగా చేస్తామని వెల్లడించారు. ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్ అవకాశం….వాలంటీర్‌కు రూ. 5వేల జీతం….రేషన్ బియ్యం డోల్ డెలివరీ….నవరత్నాలను ప్రతి పేదవాడికి ఇంటికి చేరుస్తామని పగటిపూట కరెంటు 9 గంటల పాటు ఉచిత విద్యుత్…జగన్ హామీనిచ్చారు. మరి జగన్ హామీలను  ప్రజలు ఆదరిస్తారా ? లేదా ? అనేది చూడాలి.