కుప్పంలో జగన్: బీసీ సీటు గుంజుకున్నాడు.. చంద్రబాబుపై గెలిపిస్తే మంత్రిని చేస్తా

ఎన్నికల ప్రచారంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఇటీవల ప్రతిపక్ష నాయకుడి ఇలాఖా పులివెందులలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించగా..

  • Published By: vamsi ,Published On : April 5, 2019 / 06:25 AM IST
కుప్పంలో జగన్: బీసీ సీటు గుంజుకున్నాడు.. చంద్రబాబుపై గెలిపిస్తే మంత్రిని చేస్తా

Updated On : April 5, 2019 / 6:25 AM IST

ఎన్నికల ప్రచారంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఇటీవల ప్రతిపక్ష నాయకుడి ఇలాఖా పులివెందులలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించగా..

ఎన్నికల ప్రచారంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఇటీవల ప్రతిపక్ష నాయకుడి ఇలాఖా పులివెందులలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. ఇవాళ (5 ఏప్రిల్ 2019) కుప్పంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ జగన్. చిత్తూరు, కడప, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రచారం చేస్తున్న జగన్.. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో రోడ్ షో నిర్వహించారు. కుప్పం ఎంఆర్ సర్కిల్‌లో మాట్లాడిన జగన్.. జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
Read Also : లక్ష్మీ పార్వతిపై లైంగిక వేధింపుల కేసు నమోదు

కుప్పంలో అయితే బీసీలు ఎక్కువగా ఉన్నారని, ఇక్కడైతే వారిని మోసం చేసి ఈజీగా గెలవవచ్చుననే ఉద్దేశంతో కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తున్నారని జగన్ అన్నారు. బీసీలను వాడుకుని చంద్రబాబు వదిలేస్తారని ఆరోపించారు. బీసీలు ఎక్కువగా ఉండే కుప్పం సీటును బీసీలకు ఇవ్వకుండా గుంజేసుకుని చంద్రబాబు నిలబడ్డాడని ఆరోపించారు. 30ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి కుప్పం నియోజకవర్గంకు చంద్రబాబు ఏమీ చేయలేదని అన్నారు.

ఇదే కుప్పంలో ఏం అభివృద్ధి జరిగిందో ఆలోచించండి అని జగన్ అడిగారు. చంద్రబాబు హయాంలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని అన్నారు. ఏపీలో చదువుకున్నవారు 67శాతం మంది అయితే కుప్పంలో మాత్రం చదువుకున్నవారు 61.8శాతం మాత్రమేనని అన్నారు. చాలా గ్రామాల్లో ప్రాథమిక విద్య చదువుకోనివారు ఉన్నారని జగన్ అన్నారు. కుప్పం నుంచి వైసీపీ తరుపున నిలబడిన చంద్రమౌళిని గెలిపిస్తే కేబినేట్‌లో చోటు ఇస్తానని మంత్రిని చేస్తానని వెల్లడించారు. 
Read Also : ఎన్నికల తర్వాత మోడీ జైలుకు: రాహుల్ గాంధీ