బాబు సీఎం..ఉద్యోగాలు గోవిందా – జగన్

చంద్రబాబు సీఎం అయిన తరువాత ఎన్ని ఉద్యోగాలు ఊడాయో చెప్పారు వైసీపీ అధ్యక్షుడు జగన్. తాము అధికారంలోకి వస్తే మాత్రం 2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీనిచ్చారు. ఆయన హాయంలో ఎన్నో మోసాలు..కుట్రలు జరిగాయని చెప్పుకొచ్చారు. పొదుపు సంఘాల అప్పులు గతంలో కంటే మరింత పెరిగినట్లు. డిగ్రీ చదువుకున్న వారు వలసలు వెళ్లిపోతున్నారని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వలేదన్నారు. బాబు విధానాలను జగన్ ఎండగట్టారు. ఈ సందర్భంగా ఎన్ని ఉద్యోగాలు ఊడాయో చెప్పుకొచ్చారు జగన్.
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై జగన్ కామెంట్లు
– 30 వేల ఆదర్శ రైతులు ఉద్యోగాలు గోవిందా.
– గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న వర్కింగ్ ఇన్స్‌పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు 3500 ఉద్యోగాలు గోవిందా.
– గోపాల మిత్రలో పనిచేస్తున్న 1000 ఉద్యోగాలు గోవిందా.
– ఆయుష్‌లో పనిచేస్తున్న 8 మంది ఉద్యోగాలు గోవిందా.
– సాక్షర భారత్‌లో పని చేస్తున్న 30వేల మంది ఉద్యోగాలు గోవిందా.
– మధ్యాహ్న భోజన కార్యక్రమంలో 14 సంవత్సరాల నుండి పనిచేస్తున్న 85వేల మంది ఉద్యోగాలు గోవిందా.
– మిగిలిపోయిన వారు జీతాలు పెంచాలని కోరితే..పోలీసులతో దాడి చేయిస్తున్నారని జగన్ విమర్శించారు.
57 నెలలు అన్యాయం చేసి..చివరి మూడు నెలలు నిరుద్యోగ భృతి ఇస్తామని..కేవలం 3 లక్షల మందికి..రూ.1000 ఇస్తామని బాబు చెబుతున్నారని తెలిపారు. బాబు అధికారంలోకి రాక ముందు లక్షా 42 వేల ఉద్యోగాలు ఉన్నాయని కమల్ నాథ్ కమిటీ నివేదిక చెప్పిందని..ఈ ఉద్యోగాలు వస్తాయని ఎంతో మంది కోచింగ్ సెంటర్లకు వేలకు వేలు తగిలేస్తున్నారని అయినా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదన్నారు. మొత్తంగా ఉద్యోగాల సంఖ్య 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీలున్నాయన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్ హామీనిచ్చారు.
Read Also : ఏపీకి ఈసీ షాక్ : నిరుద్యోగ భృతి పెంచొద్దు.. ఇవ్వొద్దు