Viral Video: వెన్నులో వణుకు పుట్టించే ఘటన.. ఇంట్లో సీలింగ్ నుంచి పడ్డ మూడు అతిపెద్ద పాములు

ఇంట్లో సీలింగ్ నుంచి మూడు అతిపెద్ద పాములు జారి పడ్డాయి. వెన్నులో వణుకు పుట్టించే ఈ ఘటన మలేషియాలో చోటుచేసుకుంది. ఒకరి ఇంట్లో వింత శబ్దాలు వస్తుండడంతో వారు ఎమర్జెన్సీ సిబ్బందికి ఫోన్ చేశారు. ఆ సిబ్బంది ఇంట్లోకి వచ్చి చూడగా సీలింగ్ లో ఓ పెద్ద పాము కనపడింది. దాన్ని బయటకులాగేందుకు ప్రయత్నించగా సీలింగ్ కూలి మూడు పాములు కనపడ్డాయి. అవి చాలా పెద్దగా ఉన్నాయి.

Viral Video: వెన్నులో వణుకు పుట్టించే ఘటన.. ఇంట్లో సీలింగ్ నుంచి పడ్డ మూడు అతిపెద్ద పాములు

Viral Video

Updated On : February 14, 2023 / 5:33 PM IST

Viral Video: ఇంట్లో సీలింగ్ నుంచి మూడు అతిపెద్ద పాములు జారి పడ్డాయి. వెన్నులో వణుకు పుట్టించే ఈ ఘటన మలేషియాలో చోటుచేసుకుంది. ఒకరి ఇంట్లో వింత శబ్దాలు వస్తుండడంతో వారు ఎమర్జెన్సీ సిబ్బందికి ఫోన్ చేశారు. ఆ సిబ్బంది ఇంట్లోకి వచ్చి చూడగా సీలింగ్ లో ఓ పెద్ద పాము కనపడింది. దాన్ని బయటకులాగేందుకు ప్రయత్నించగా సీలింగ్ కూలి మూడు పాములు కనపడ్డాయి. అవి చాలా పెద్దగా ఉన్నాయి.

ఒక్కసారిగా అందరూ భయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ పాములు రూఫ్ పైనే ఉండడానికి ప్రయత్నించాయి. చివరకు వాటి తోకలను పట్టుకుని ఎమర్జెన్సీ సిబ్బంది వాటిని తీసుకెళ్లి అడవిలో విడిచిపెట్టారు. అంత పెద్ద పాములు తమ ఇంట్లోకి వచ్చి ఉన్నాయన్న విషయాన్ని తలుచుకుంటూనే ఆ ఇంటి సిబ్బంది వణికిపోతున్నారు.

అవి దగ్గరలోని అటవీ ప్రాంతంలో నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఆ ఇంట్లోని వారికి పాములు హాని తలపెట్టకుండా ఉన్నందుకు థ్యాంక్యూ దేవుడా అంటూ కొందరు కామెంట్లు చేశారు. ఇళ్లలోకి పాములు వచ్చిన ఘటనలు గతంలో చాలా చూశామని, ఇంత పెద్ద పాములు వచ్చిన దృశ్యాలు ఎన్నడూ చూడలేదని కొందరు పేర్కొన్నారు.


Valentine’s Day Special : వ్యాలెంటైన్స్ డే స్పెషల్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!