Viral video: అంత పెద్ద మొసలి తోక ఎలా పట్టుకున్నావు భయ్యా?.. వీడియో వైరల్

మొసళ్లను చూస్తేనే చాలా మందికి భయం వేస్తుంది. ఇక భారీ మొసళ్లు ఉన్నాయంటే ఆ వైపునకే వెళ్లరు. అయితే, ఏ భయమూ లేకుండా ఓ భారీ మొసలి తోకను పట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నిద్రపోతున్న భారీ మొసలి వద్దకు వెళ్లి మరీ ఈ సాహసం చేశాడు అతడు.

Viral video: అంత పెద్ద మొసలి తోక ఎలా పట్టుకున్నావు భయ్యా?.. వీడియో వైరల్

Viral video

Updated On : December 24, 2022 / 5:41 PM IST

Viral video: మొసళ్లను చూస్తేనే చాలా మందికి భయం వేస్తుంది. ఇక భారీ మొసళ్లు ఉన్నాయంటే ఆ వైపునకే వెళ్లరు. అయితే, ఏ భయమూ లేకుండా ఓ భారీ మొసలి తోకను పట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నిద్రపోతున్న భారీ మొసలి వద్దకు వెళ్లి మరీ ఈ సాహసం చేశాడు అతడు.

ఆ మొసలి నోరు తెరిచి ఉండడం, దాని ఆకారం చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. మొసలి ముందు భాగం నుంచి దాని వెనకకు వెళ్లిన ఆ వ్యక్తి దాని తోకను పట్టుకుని, అటూ ఇటూ అన్నాడు. ఆ మొసలి అతడిని ఏమీ చేయలేదు. కనీసం స్పందించకుండా, కదలకుండా ఒకే చోట ఉండిపోయింది. అంత పెద్ద మొసలి తోక ఎలా పట్టుకున్నావు భయ్యా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మొసళ్లతో ఆడుకోవడం అతడికి అలవాటై ఉంటుందని మరికొందరు పేర్కొన్నారు. ఆ వీడియో చూసి షాకయ్యాం అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. మొసలిని పట్టుకున్న ఆ వ్యక్తిపై మరికొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాని జోలికి వెళ్లడం ఎందుకని నిలదీస్తున్నారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని విమర్శిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by animalsoont (@animalsoont)


Noida viral video: సినిమా స్టైల్లో 2 కార్లతో నడిరోడ్డుపై స్టంట్లు చేసిన విద్యార్థులు.. కేసు నమోదు