Viral Video: భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని వెళ్లిన వృద్ధుడు.. వీడియోలు తీశారుగానీ ఒక్కరూ సాయం చేయలేదు

భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని ఆసుపత్రి నుంచి తీసుకెళ్లాడు ఓ 70 ఏళ్ల వృద్ధుడు. అంబులెన్సుకు డబ్బులు లేకపోవడంతో ఇలా తన కుమారుడి సాయంతో భార్యను ఇంటి వరకు మోసుకెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు. పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Viral Video: భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని వెళ్లిన వృద్ధుడు.. వీడియోలు తీశారుగానీ ఒక్కరూ సాయం చేయలేదు

Viral Video

Updated On : January 6, 2023 / 3:49 PM IST

Viral Video: భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని ఆసుపత్రి నుంచి తీసుకెళ్లాడు ఓ 70 ఏళ్ల వృద్ధుడు. అంబులెన్సుకు డబ్బులు లేకపోవడంతో ఇలా తన కుమారుడి సాయంతో భార్యను ఇంటి వరకు మోసుకెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు. పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ నేతలు పోస్ట్ చేస్తూ.. సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం కనీసం అంబులెన్సు సర్వీసులను కూడా ఉచితంగా అందించడం లేదని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణదేవన్ (70) అనే వృద్ధుడి భార్య ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది.

అంబులెన్స్ మాట్లాడి తీసుకురమ్మని తన కుమారుడు రామ్ ప్రసాద్ దేవన్ ను పంపాడు. అయితే, రూ.3,000 ఇస్తేగానీ రానని అంబులెన్స్ డ్రైవర్ అన్నాడు. అంత డబ్బు కృష్ణదేవన్, రామ్ ప్రసాద్ దేవన్ వద్ద లేదు. తమ వద్ద రూ.1,200 మాత్రమే ఉందని చెప్పారు.

అయితే, వారుండే క్రాంతి ప్రాంతం 50 కిలోమీటర్ల దూరం ఉంటుందని, రూ.3,000కు ఒక్క రూపాయి కూడా తగ్గించబోనని అంబులెన్స్ డ్రైవర్ తెగేసి చెప్పడంతో చేసేది ఏమీ లేక తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. తాము నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో చాలా మంది తమ వీడియోలు తీశారని, అయితే, వారిలో ఒక్కరు కూడా తమకు సాయం మాత్రం చేయలేదని చెప్పాడు. చివరకు ఓ ఎన్జీవో ప్రతినిధులు ఈ విషయం తెలుసుకుని ఓ వాహనాన్ని ఏర్పాటు చేసి మృతదేహాన్ని తరలించారు.

Man dragged by truck: స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టి కిలోమీటరు ఈడ్చుకెళ్లిన ట్రక్కు