Viral Video: ఫైర్ సిబ్బంది అడ్డుకున్నా వినిపించుకోలేదు.. ప్రాణాలు అడ్డుపెట్టి మరీ పెంపుడు కుక్కను కాపాడుకున్నాడు
మంటల్లో చిక్కుకున్న ఇంట్లో మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అకస్మాత్తుగా, ఒక వ్యక్తి వచ్చి కాలిపోతున్న ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు.

Man Saves Dog: పెంపుడు జంతువులతో మనుషులకు ఉండే ఎమోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటిని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తారు. ఇక మానవత్వం కాస్త ఓవర్ లోడ్ అయినవారైతే.. వీధి జంతువులపై ప్రేమ, జాలి చూపిస్తుంటారు. అయితే వీటి కోసం కొన్నిసార్లు పెద్ద పెద్ద రిస్కీ పనులు చేస్తుంటారు. ప్రాణాల్ని పణంగా పెట్టే సందర్భాలు కూడా లేకపోలేదు. తాజాగా అలాంటి ఒక ఘటనే జరిగింది. భగ్గున మండుతున్న ఇంట్లో చిక్కుకున్న తన కుక్క కోసం ఒక వ్యక్తి తన ప్రాణాలనే పణంగా పెట్టాడు.
ఫైర్ సిబ్బంది అడ్డుకున్నా వినలేదు. అతడిని ఆపేందుకు వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పరుగు పరుగున నిప్పుల గుండంలోకి వెళ్లి కాసేపటికి తన కుక్కతో తిరిగి వచ్చాడు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Man runs into burning home to save his dog pic.twitter.com/qWqyIlZbTS
— B&S (@_B___S) August 13, 2023
మంటల్లో చిక్కుకున్న ఇంట్లో మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అకస్మాత్తుగా, ఒక వ్యక్తి వచ్చి కాలిపోతున్న ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అగ్నిమాపక సిబ్బంది అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. అయితే భారీ మంటలు, అతని ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసీ పట్టించుకోకుండా అతను వారిని దాటుకొని లోపలికి వెళ్లాడు. కొద్దిసేపటిలో తన కుక్కతో బయటకు రావడం చూడొచ్చు.
ఆ సమయంలో అతడిని వెనక్కి వచ్చేయంటూ అరుస్తుండడం వినొచ్చు. అయితే కాసేపటికి అతను కుక్కేబ బయటకు తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ‘‘ఆ వ్యక్తి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన కుక్కను రక్షించడానికి కాలిపోతున్న ఇంటి లోపలికి వెళ్ళాడు, కుక్కతో బయటకు వచ్చినప్పుడు తన కుక్కను మొదట లాల్చాడు. ఒక వ్యక్తికి తన కుక్క పట్ల ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టి తెలుస్తుంది’’ అని నెటిజెన్లు అతడి మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.