US Man Dance : వావ్..! ‘బచ్ పన్ కా ప్యార్’ పాటకు అమెరికన్ స్టెప్పులు అదుర్స్!!

'బచ్‌పాన్ కా ప్యార్’ ఆమె పాటకు అద్భుతంగా డాన్స్ వేశారు అమెరికాకు చెందిన వ్యక్తి. రికీ పాండ్ అనే వ్యక్తి బాలీవుడ్ పాటలకు డాన్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా అతడు బచ్‌పాన్ కా ప్యార్’ అనే పాటకు డాన్స్ చేశారు. అయితే ప్రస్తుతం ఆ డాన్స్ వీడియో వైరల్ గా మారింది.

US Man Dance : వావ్..! ‘బచ్ పన్ కా ప్యార్’  పాటకు అమెరికన్ స్టెప్పులు అదుర్స్!!

Us Man Dance

Updated On : July 30, 2021 / 2:20 PM IST

US Man Dance : కొద్దీ రోజులుగా ‘జానే మేరీ జానే మన్ బచ్‌పాన్ కా ప్యార్’ అనే పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఛత్తీస్ ఘడ్ కి చెందిన సహదేవ్ డిర్డో అనే విద్యార్థి క్లాస్ రూమ్ లో పాడాడు. దీనిని వీడియో తీసిన ఉపాద్యాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను 2019లో పోస్ట్ చేయగా గత నెలరోజులుగా వైరల్ అవుతుంది. స్టూడెంట్ గాత్రం అద్భుతంగా ఉండటంతో ఈ వీడియో చూసి అందరు మెచ్చుకుంటున్నారు.

ఇక దీనిపై కొందరు బాలీవుడ్ నటీనటులు కూడా స్పందించారు. ఇక ఇదిలా ఉంటే.. ఆ పిల్లాడు పాడిన పాటకు ఓ వ్యక్తి డాన్స్ చేశాడు. అమెరికాకు చెందిన రికీ పాండ్ అనే వ్యక్తి ఈ పాటకు డాన్స్ చేశారు. ప్రస్తుతం అతడి డాన్స్ వీడియో వైరల్ గా మారింది.

 

పాండ్ రంగు రంగుల షర్ట్, బూడిద కలర్ ప్యాంటు వేసుకొని జానే మేరీ జానే మన్ బచ్‌పాన్ కా ప్యార్’ పాటకు కుర్రాడిలా డాన్స్ చేశారు. ఈ వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. వారం క్రితం షేర్ చేసిన ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

 

 

 

View this post on Instagram

 

A post shared by Ricky Pond (@ricky.pond)

ఇక లైక్ లు కూడా అదే రేంజ్ లో వచ్చిపడ్డాయి. 50 ఏళ్లకు పైగా వయసున్న పాండ్ ఆలా చిన్న పిల్లాడిలా ఎగదరం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పాటకు తగినట్లు అతడు చెసిన స్టెప్పులు అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ వీడియోకు కామెంట్స్ కూడా ఓ రేంజ్ లో వచ్చాయి. పాండ్ టాలెంట్ ను అందరు మెచ్చుకుంటున్నారు.

 

 

 

View this post on Instagram

 

A post shared by PATNA in HD (@patnahd)

 

కాగా రికీ పాండ్ గతంలో కూడా అనేక బాలీవుడ్ సాంగ్స్ కి డాన్స్ చేశారు. ఎప్పుడు రానంత పాపులారిటీ ఈ సాంగ్ తో వచ్చింది.