Viral Video : కదులుతున్న రైలు లోంచి పిల్లలతో సహా దూకిన మహిళ…కాపాడిన కానిస్టేబుల్
రైలు ప్రయాణం అంటేనే ముందుగా రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. రద్దీని దాటుకుని, ప్లాట్ ఫామ్ లు మారి మనం ఎక్కాల్సిన రైలు ఎక్కాల్సి ఉంటుంది.

Ujjaini Railway Station
Viral Video : రైలు ప్రయాణం అంటేనే ముందుగా రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. రద్దీని దాటుకుని, ప్లాట్ ఫామ్ లు మారి మనం ఎక్కాల్సిన రైలు ఎక్కాల్సి ఉంటుంది. తీరా అలా వెళ్లాక ఒకోసారి ఒక రైలు బదులు ఇంకో రైలు ఎక్కితే ఆ కంగారు మాములుగా ఉండదు… మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని రైల్వే స్టేషన్ లో ఇదే జరిగింది.
ఒకరైలు ఎక్కబోయి ఇంకో రైలు ఎక్కిన మహిళ తన పిల్లలతో సహ కదులుతున్న రైలులోంచి కిందకు దూకేసింది. ఆక్రమంలో మహిళ రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య పడింది. కనురెప్ప పాటులో ఆర్పీఎఫ్ కానిస్టేబులు ఆమెను ఇవతలకు లాగి రక్షించటంతో బతికి బయటపడింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉజ్జయిని రైల్వే స్టేషన్‌లో ఒక రైలు ఎక్కబోయి మరోక రైలు ఎక్కిన మహిళ రైలు కదిలే సమయానికి తాను ఎక్కాల్సింది ఆ రైలు కాదని తెలుసుకుంది. ఈలోగా రైలు ముందుకు కదిలింది. వెంటనే తన ఇద్దరు పిల్లలను ఒకరి తర్వాత ఒకరిని రైలు లోంచి ప్లాట్‌ఫామ్ మీదకు విసిరేసింది.
ఇది గమనించి అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లలిద్దరినీ రక్షించి పక్కకు తీసుకు వెళ్లాడు. ఈలోగా ఆ మహిళ కూడా కదులుతున్న రైలులోంచి కిందకు దూకింది. ఈక్రమంలో ఆమె రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య పడుతుండగా కనురెప్పపాటులో స్పందించిన కానిస్టేబుల్ ఆమెను కూడా సురక్షితంగా ఇవతలకు లాగి ప్రాణాలు కాపాడాడు. దీంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సీసీటీవీ పుటేజిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో నెటిజన్లు ఆ కానిస్టేబుల్ ను అభినందిస్తున్నారు.
Also Read : Special Trains : తిరుపతి-హైదరాబాద్-కాకినాడ ప్రత్యేక రైళ్లు
“जल्दबाजी हो सकती है घातक”#उज्जैन– गलत ट्रैन में सवार हुई महिला,पता चलने पर जल्दबाजी में प्लेटफॉर्म पर चलती ट्रेन से उतरी, संतुलन बिगड़ने से महिला ट्रैन की चपेट में आने से बची,प्लेटफार्म पर मौजूद पुलिस कर्मी महेश कुशवाहा की सतर्कता से हादसा टला,#GRP @RailwaySeva#Ujjain #CCTV pic.twitter.com/943niH1usl
— vikas singh Chauhan (@vikassingh218) May 14, 2022