Special Trains : తిరుపతి-హైదరాబాద్-కాకినాడ ప్రత్యేక రైళ్లు

వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే  ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అధికారులు  తెలిపారు.

Special Trains : తిరుపతి-హైదరాబాద్-కాకినాడ ప్రత్యేక రైళ్లు

Tiurpati Railway Station

Updated On : May 15, 2022 / 4:10 PM IST

Special Trains : వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే  ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అధికారులు  తెలిపారు.

వాటిలో హైదరాబాద్‌–తిరుపతి (07433/07434) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 17న సాయంత్రం 6.40 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.50కి తిరుపతికి చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో 19వ తేదీ రాత్రి 8.25 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు నాంపల్లికి చేరుకుంటుంది.

తిరుపతి–కాకినాడ (07435/07436) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 18వ తేదీ సాయంత్రం 4.15 గంటలకు కాకినాడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 19వ తేదీ ఉదయం 7.30 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 6.40కి కాకినాడ చేరుకుంటుంది.