బౌలింగ్ వేసే ముందు గేల్ రెండు కాళ్లు కట్టేయాలి : అశ్విన్

  • Published By: sreehari ,Published On : October 21, 2020 / 06:50 PM IST
బౌలింగ్ వేసే ముందు గేల్ రెండు కాళ్లు కట్టేయాలి : అశ్విన్

Updated On : October 21, 2020 / 6:56 PM IST

Ashwin Teases Chris Gayle : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో విండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌‌ను రవిచంద్రన్ అశ్విన్ సరదాగా ఆటపట్టించాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఢిల్లీ పరాజయం పాలైంది.



మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ను రవిచంద్రన్‌ అశ్విన్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. గేల్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా అతని షూ లేస్‌ ఒకటి ఊడింది. అశ్విన్‌ వెంటనే దగ్గరగా వెళ్లి గేల్‌ షూలేస్‌ను కట్టి సరిచేశాడు. సరదాగా గేల్‌ను ఆట పట్టిస్తూ ఈ ఫోటోను అశ్విన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.



‘డెవిల్‌ చూడడానికి భయానకంగా ఉంటుంది. విధ్వంసం కూడా అలాగే ఉంటుంది. అందుకే బౌలింగ్‌ చేసే ముందు గేల్‌ రెండు కాళ్లు కట్టేసి ఆడమనాలి’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. నువ్వు నన్నెంతో నమ్మావు.. కానీ, నిన్ను ఔట్ చేశాను.. ఈ రోజు మాకు కఠినమైన రోజు.. కానీ తిరిగి బలంగా తయారవుతాం’ అంటూ అశ్విన్ క్యాప్షన్ ఇచ్చాడు.



ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ శిఖర్‌ ధావన్‌ మరోసారి సెంచరీతో మెరవడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఢిల్లీ 164 పరుగులు చేసింది.

 

View this post on Instagram

 

The devil is always in the detail.??? .. “Tie both his feet together, before bowling to him”. @chrisgayle333 you trusted me with it and I am sorry for letting you down. ?? Tough day for us @DelhiCapitals but, we will bounce back stronger.

A post shared by Ashwin (@rashwin99) on