తీస్కోండి నా బెంజ్: పావురాల జంటకు బెంజ్ కారు గిఫ్ట్ గా ఇచ్చిన దుబాయ్ ప్రిన్స్

సాధారణంగా పావురాలు మన ఇళ్ల గూడు కట్టి గుడ్లు పెట్టటానికి ప్రయత్నిస్తే..అరె పావురాలు ఇంట్లో ఉండటం మంచిది కాదంటూ వాటిని తోలేస్తాం..కానీ దుబాయ్ ప్రిన్స్ మాత్రం ఏకంగా గుడ్లు పెట్టిన పావురాల జంటకు ఏకంగా తన కారునే గిఫ్టుగా ఇచ్చేశాడు. అది అలాంటిలాంటికారు కాదండోయ్..‘బెంజ్’కారు.
గుడ్లు పెట్టేకాలం వచ్చిదంటే చాల పావురాలు గూడు ఎక్కడ పెట్టాలా? అని వెతుక్కుంటాయి. అలా పెట్టిన గూడులో పెట్టిన గుడ్లకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండేలా జాగ్రత్తగా సురక్షితమైన ప్రదేశంలో గూడు పెట్టుకుంటాయి. అలా దుబాయ్ లో విహరించే ఓ పావురాల జంట గూడు పెట్టే ప్రదేశం కోసం వెతుకుతున్నాయి. అలా వెతగ్గా వెతగ్గా..ఓ బెంజ్ కారు కనిపించింది. ‘అరె ఈ కారు భలే ఉందే.. ఎంచక్కా ఇక్కడే గుడ్లు పెట్టి, పొదిగి పిల్లల్ని చేసుకుని పెంచుకోవాలి’అనుకున్నాయి. అలా ఆ పావురాల జంట ఆ కారులో గూడు కట్టేసి గుడ్లు కూడా పెట్టేశాయి.
అది గమనించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఆ పావురాలను చూసి ముచ్చటపడ్డాడు.‘కారు కావాలా పావురమా.. అయితే తీస్కో’ అని దానికి కారును గిఫ్టుగా ఇచ్చేశాడు దుబాయి క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్దుమ్. అంతేకాదు..ఆ గూడు చెదిరిపోకుండా ఉండేందుకు కారు చుట్టూ తాళ్లు కట్టారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా ఆదేశాలు జారీ చేశారు. కారుపై ఉన్న గూడుకు ఎండ తగలకుండా వర్షం వస్తే తడవకుండా ఉండేలా టార్పాలిన్ కూడా కట్టించాడు ఈ యంగెస్ట్ స్మార్టెస్ట్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ వద్ద ఉన్న మెర్సిడెన్ ఎస్‌యూవీ కారు ఉంది. దానిని ఆయన ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో గ్యారేజ్‌లో ఉన్న ఆయన కారుపై ఓ పావురం పుల్లా పుల్లా పేర్చి గూడును నిర్మించుకుంది. అలా ఆ పావురాల జంటకు ప్రిన్స్ తన కారునే ఇచ్చేశాడు.
View this post on Instagram