పొలంలో కాదు రోడ్డుమీదే వరి పంట…కాయగూరల తోటలు..అన్నీ ఊరిప్రజలకు ఉచితమే

  • Published By: nagamani ,Published On : October 30, 2020 / 01:18 PM IST
పొలంలో కాదు రోడ్డుమీదే వరి పంట…కాయగూరల తోటలు..అన్నీ ఊరిప్రజలకు ఉచితమే

Updated On : October 30, 2020 / 2:57 PM IST

Kerala bus driver roadside : అతనో బస్సు డ్రైవర్.. చాలా పెద్ద మనస్సు కలిగిన ఆ డ్రైవర్ అంటే ఆ ఊరివారందరికీ చాలా గౌవరం..ఇష్టం. అతను బస్సు స్టీరింగ్ పట్టుకున్నాడంటే బస్సు రయ్ మంటూ దూసుకుపోతుంది. అలా బస్సు నడిపే అతను రోడ్డు పక్కన ఖాళీగా ఉండే స్థలాన్ని చూసి అరె ఆ నేలంతా ఖాళీగా ఉండిపోతోందే..ఏదన్నా పంట వేస్తే సద్వినియోగం అవుతుంది కదాని అనుకునేవాడు.



అనుకుని ఊరుకోకుండా ఆ గ్రామ ప్రజలతో మాట్లాడి..రోడ్డు పక్కనే వరి పంట వేసి పండిస్తున్నాడు.వరి పండాలంటే పుష్కలంగా నీరు కావాలి..అలా వరి మొక్కలు నీటిలో ఉండాలంటే పొలంలో పండిస్తారు. కానీ ఈ బస్సు డ్రైవర్ మాత్రం ఏకంగా రోడ్డు పక్కనే వరి పండిస్తూ గ్రామస్తులతో శెభాష్ అనిపించుకుంటున్నాడు. మరి బస్సు డ్రైవర్ కాదు కాదు రైతు గురించి ‘‘ రోడ్డు పక్క వరి పంట’’ గురించి తెలుసుకుందామా..



https://10tv.in/metro-rail-pillar-damaga-at-moosapet-metro-station/
అది కేరళలోని త్రిచూర్‌కు దగ్గరగా ఉండే ‘పెరిన్‌జనమ్‌’ అనే పల్లె. ఆ పల్లెలో ప్రయివేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో బస్‌ డ్రైవర్‌గా పని చేసేవాడు అనిల్‌ కుమార్‌. ఆ పల్లెలో వ్యవసాయం చేయటానికి పెద్దగా వ్యవసాయ భూమి లేదు. కాని నేలంటే ఎంతో ప్రాణంపెట్టే అనిల్ కుమార్ కు ఊళ్లో రోడ్డుకు ఇరువైపులా ఒక గజం మేర వెడల్పుతో మట్టి మార్జిన్‌ ఉంది. రోడ్డు పక్కన ఖాళీగా ఉండే స్థలం అలా వృథాగా ఉండటం ఇష్టం లేదు.


ఆ మార్జిన్‌ నేల చాలు తనకు పంట పండించటానికి అనుకున్నాడు అనిల్‌ కుమార్‌. ఆ నేలలో మెల్లగా కూరగాయ మొక్కలు పెంచడం మొదలు పెట్టాడు. ఊరి పంచాయతీ ఇది గమనించింది. ఏంటీ రోడ్డు పక్కన పంటలేస్తున్నావ్ అని గ్రామ పెద్దలు అడిగారు. దానికి అనిల్ కుమార్ ‘రోడ్డుపై రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా..పంట వేస్తే నష్టం ఎవ్విరీ లేదు కదా..అటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఇక్కడ వేసే ఈ కాయగూరలు నేను అమ్ముకోను..అవి ఊరివారందరికీ చెందుతాయి ఫ్రీగానే.. ఇక ఇబ్బందేముంది’’ అని అని చెప్పాడు. దీనికి పంచాయితీ ఇదేదో బాగానే ఉందని అనుకుని ఒప్పుకుంది.


అనిల్‌ కుమార్‌ రోడ్డు పక్క వ్యవసాయం మొదలు పెట్టాడు. తనకు డ్యూటీ లేనప్పుడల్లా రోడ్డుకు ఇరువైపులా అన్ని రకాల కాయగూరలూ నాటి సాగు చేశాడు. కొన్ని మొక్కలు ప్రభుత్వం వారి నుంచి తెచ్చుకున్నాడు. కొన్నిమొక్కలు గ్రామస్తులే ఇచ్చారు. విత్తనాలు కొనుక్కొచ్చి నాటి..రోజు నీళ్లు పోసేవాడు. ఆ మొక్కలు చక్కగా ఏపుగా పెరిగాయి. కాయగూరలు చక్కగా విరగా కాశాయి. అవి చక్కగా తాజాగా కనిపిపిస్తుంటే చూసిన గ్రామస్తులు ‘వీటిని మాకు అమ్ముతావా? అని అడిగారు. ఇవి అమ్మకానికి కాదు మీకోసమే..మనకోసమే అని చెప్పాడు. దానికి వాళ్లు ఆనందపడిపోతే ‘‘అయితే వీటిని మేం కోసుకోవచ్చా‘’ అని అడిగితే ‘నన్ను అడిగే పనే లేదు’ మీకు ఏది కావాలిస్తే అది కోసుకోండి అవన్నీ మనందరివీ అని చెప్పాడు.


ఒక అందమైన తోటే రోడ్డు పక్కన వెలియడం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు. అలా అనిల్‌ కుమార్‌ మీద గౌరవం పెరిగిపోయింది గ్రామస్థులందిరికీ. అలా కూరగాయాలే కాదు ‘‘వరి పంట’’కూడా వేసి పండించవచ్చని అనే ఆలోచన వచ్చింది. కానీ గ్రామస్థులంతా రోడ్డు మీద కాయగూరలు పండినట్లుగా వరి పండదు వద్దు అని చెప్పారు.


కానీ అనిల్ కుమార్ ఏం ఎందుకు పండదు వేసి చూద్దాం అని ఆ రోడ్డు పక్కన గజం స్థలం పొడుగునా ‘‘వరి పంట’ వేసి పండించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అనుకున్నది చేసి చూపించావ్ అనిల్ శెభాష్ అంటూ అందరి మెచ్చుకున్నారు. విశాలమైన పొలంలో పండే వరి ఆ జానాబెత్తెడు స్థలంలోనే విరగపండింది. ఈక్రమంలో లాక్‌డౌన్‌ దెబ్బ అనిల్ కుమార్ పై కూడా పడింది. వాహనాల తిరగటం బంద్ కావటంతో అనిల్ డ్రైవర్ ఉద్యోగం పోయింది.


అయినా సరే కూరగాయాలు పంట..వరిపొలం పంటమీద ఆశలు పెట్టుకోలేదు. తన ఉపాధి పోయినా సరే..ఆ పంటలు మాత్రం గ్రామస్తులకే అనే మాటమీదే నిలబడ్డాడు. అదంతా ‘ఊరి స్థలం..దాని మీద పంట వచ్చేది ఊరికే’ అంటున్నాడు. మరి అనిల్ కుమార్ ది పెద్ద మనస్సు కాక మరేమిటి చెప్పండి..కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆ పంట నాదే అనే ఆశలు పెట్టుకోలేదు.అప్పుడప్పుడు అతడు తనకు అవసరమైనంత వరకూ మాత్రమే కాయగూరలను కోసి ఇంటికి తీసుకెళుతుంటాడు. మరి వాటిని అలా ‘అలా కోయకపోతే ముదిరిపోతాయి..కూరలు వండుకోవటానికి పనిచేయవు అంటాడు అనిల్ కుమార్.


‘ఇలా ప్రతి ఊళ్లో చేయవచ్చంటాడు. ప్రతీ ఒక్కరికి ఇటువంటి ఆలోచన రావాలనే ఉద్ధేశ్యంతోనే ఈ ‘‘రోడ్డు పక్క పంట’’ అని చెబుతున్నాడు అనిల్ కుమార్. కూరగాయల మధ్య మధ్య అందమైన పూల మొక్కల్నికూడా పెంచుతున్నాడు అనిల్. పూలు చక్కగా విరబూసి ఆ దారంతా ఎంతో అందంగా కనువిందు చేస్తుంటుంది. అందంతో పాటు గ్రామస్తుల అవసరాలు కూడా తీరుస్తున్నాడు అనిల్ కుమార్ తన రోడ్డు పక్క పంటలతో.