అబ్బాయిలు ఎంతమంది తొంగి చూస్తున్నారో..? బ్యాక్ ప్యాకెట్లో ఫోన్ కెమెరా పెట్టి.. వీడియో తీసింది!

model Alexas Morgan : సాధారణంగా అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు.. చాలామంది అబ్బాయిలు నోరెళ్లబెట్టి అలానే చూస్తుంటారు. అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్తుంటే వెనుక నుంచి వాళ్లను అలానే చూస్తుండిపోతారు.
టిక్ టాక్ ట్రెండ్ చూసిన మోడల్.. అసలు అబ్బాయిలు.. అమ్మాయిలను వెనుక నుంచి ఎలా చూస్తారు.. తనను వెనుక నుంచి ఎంతమంది చూస్తున్నారో తెలుసుకోవాలనే కోరిక కలిగిందంట.
అందుకే బ్యాక్ పాకెట్లో ఫోన్ కెమెరా పెట్టి రికార్డ్ ఆన్ చేసింది. ఫ్లోరిడాలోని మియామీకి చెందిన 24ఏళ్ల Alexas Morgan మోడల్.. ఎంతమంది అబ్బాయిలు తన బ్యాక్ చూసేందుకు ఆరాటపడుతున్నారో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఫోన్ కెమెరాతో వీడియోను తీసింది..
అందులో చాలామంది అబ్బాయిలు తాను నడుస్తూ వెళ్తుండగా తమ తలను 180 డిగ్రీలు తిప్పి తొంగి చూశారంట.. అంతేకాదు.. కొంచెం పైకి లేచి తాను వెళ్లేంతవరకు అలానే చూస్తుండి పోయారని చెప్పుకొచ్చింది.
రెస్టారెంట్లలో తింటున్న ఇద్దరు పురుషులు కూడా తనను నోరెళ్లబెట్టి చూస్తుండి పోయారని తెలిపింది. తన ఫోన్ రికార్డింగ్ వీడియోలను ఇన్‌స్టా వేదికగా అలెక్సా పోస్టు చేసింది.తనకు ఇన్‌స్టాలో నాలుగు మిలియన్లకు పైగా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె వైపు మగాళ్లు చూస్తున్న కొన్ని వీడియోలకు స్లో మోషన్ ఎఫెక్ట్ ఇచ్చింది. అంతేకాదు.. వాటికి ఫన్ కోసం వాయిస్ ఓవర్ కూడా జోడించింది. అలెక్సాస్ పోస్టు చేసిన వీడియోలకు 112,000కు పైగా లైకులు వచ్చాయి.