జాతీయ జెండాకు అవమానం: తలకిందులుగా ఎగరేసిన ఏపీ మంత్రి

జాతీయ జెండాకు అవమానం: తలకిందులుగా ఎగరేసిన ఏపీ మంత్రి

Updated On : January 27, 2020 / 4:41 AM IST

దేశం మొత్తం ఆదివారం 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంది. రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులంతా జాతీయ జెండాను ఆవిష్కరించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన పనికి తప్పుడు కారణాలతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 

దానికి కారణం.. జాతీయ జెండాను తిరగేసి ఎగరేయడమే. విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ ఆఫీసులో జరిగింది ఈ ఘటన. జెండాను ఎగరేసి దానికి సెల్యూట్ చేశారు. ఆ తర్వాత జాతీయ గీతం పాడేంత వరకూ చూసుకోలేదు. పైన ఎండకు జెండా ఎగరేసినప్పటికీ తలెత్తి ఎవరూ చూడలేదు. ఈ పొరబాటు జరగడానికి అది కూడా ఓ కారణం కావచ్చు. 

మొత్తానికి సిబ్బంది చేసిన తప్పుకు మంత్రి అవంతి శ్రీనివాస్ కు విమర్శలు తప్పలేదు. జాతీయ జెండా కోడ్ ఉల్లంఘించి ఇలా తలకిందులుగా వేలాడదీయడం కొత్తేం కాదు. వ్యక్తుల నిర్లక్ష్యం చాలాసార్లు ఈ పొరబాటు జరిగేలా చేసింది.