నైట్ క్లబ్బులు ఓపెన్.. సోషల్ డిస్టాన్సింగ్‌తో డాన్సులు: వీడియో వైరల్

  • Published By: dharani ,Published On : June 9, 2020 / 04:30 AM IST
నైట్ క్లబ్బులు ఓపెన్.. సోషల్ డిస్టాన్సింగ్‌తో డాన్సులు: వీడియో వైరల్

నెదర్లాండ్స్ ప్రభుత్వం నైట్ క్లబ్బులు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, కొన్ని కండీషన్లు తప్పకుండా పాటించాలని చెప్పింది. కండీషన్లు పాటిస్తేతేనే క్లబ్బులు తెరుస్తామని చెప్పారు. ఈ క్రమంలో నిజ్మెగాన్ అనే టౌన్‌లోని నైట్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. కొత్త సామాజిక దూర నిబంధనలతో అవి తెరవబడ్డాయి. ప్రస్తుతం ఈ క్లబ్ లోని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

ఇంతకముందులాగా క్లబ్బులో గుంపులు గుంపులుగా కాకుండా పూర్తిగా మారిపోయింది. ప్రతీఒక్కరికి ఓ చైర్ ఇచ్చారు.  ఒకప్పుడు ఇష్టమొచ్చినట్లు తాగుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతీఒక్కరికి ఓ చైర్ ఇచ్చారు. కస్టమర్ ఆ చైర్‌పై కూర్చొనే ఉండాలి. డీజే సౌండ్స్, మ్యూజిక్ ఎంజాయ్ చెయ్యాలి. క్లబ్ లోకి ఒకసారి 30 మందిని మాత్రమే రానిచ్చారు. ఇందుకు పది యూరోలు (రూ.850) తీసుకున్నారు. అంతేకాదు 20 నిమిషాలకూ ఓ బ్యాచ్ ఛాన్స్ అయిపోతుంది. అందులో ఉన్న కస్టమర్లంతా బయటకు వచ్చేయాలి. ఆ తర్వాత వేరే బ్యాచ్ ను శానిటైజ్ చేసి లోపలికి రమ్మంటారు.  ఇప్పుడు మాత్రం కుర్చీలో కూర్చొనే డాన్స్ చేసే పరిస్థితి వచ్చింది. కరోనా ఇంత మార్పు తెచ్చింది.

ప్రస్తుతం ఇలాంటి క్లబ్ వల్ల అటు నిర్వాహకులకూ, ఇటు కస్టమర్లకూ ఇబ్బందిగానే ఉండొచ్చు. కానీ పరిస్థితులను బట్టి ఇలాగే ఎంజాయ్ చేయాలి తప్పదు. కాదు కూడదు అంటే తరవాత ఎంజాయ్ చేయడానికి లైఫే ఉండదు. 

Read:  కరోనాను జయించిన 94ఏళ్ల వృద్ధుడు..!