Viral video: నీటి ప్రవాహం మధ్యలో ఇరుక్కుపోయిన కుక్క ప్రాణాలు కాపాడిన వ్యక్తి
మూగ జీవాలంటే చాలా మంది ఎంతో ఇష్టాన్ని కనబర్చుతారు. అవి ఆపదలో ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతుంటారు. అటువంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మూగ జీవాలను నిజంగా కాపాడాలనుకున్న వారు ఎంతటి సాహసానికైనా తెగిస్తారన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.

Viral video
Viral video: మూగ జీవాలంటే చాలా మంది ఎంతో ఇష్టాన్ని కనబర్చుతారు. అవి ఆపదలో ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతుంటారు. అటువంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మూగ జీవాలను నిజంగా కాపాడాలనుకున్న వారు ఎంతటి సాహసానికైనా తెగిస్తారన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఓ కుక్క నీటి ప్రవాహం మధ్యలో ఇరుక్కుపోయింది. దాన్ని చూసిన ఓ వ్యక్తి దాని ప్రాణాలు కాపాడాలని అనుకున్నాడు. తాడు సాయంతో కుక్కను నీటి ప్రవాహం బారి నుంచి తప్పించాడు. మరి కొందరు ఒడ్డున నిలబడి అతడికి సాయం చేశారు. కుక్క చివరకు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
మూగ జీవంపై అతడు చూపించిన ప్రేమను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సాయం కోసం ఎదురుచూస్తూ చాలా సేపు నీటి మధ్యలోనే ఇరుక్కుపోయి, బిక్కు బిక్కు మంటూ ఉన్న కుక్కకు అతడు మరో జన్మ ఇచ్చినట్లు అయిందని కొందరు కామెంట్లు చేశారు. ఈ వీడియోను రోహ్ యాదవ్ అనే వ్యక్తి షేర్ చేసిన కొద్దిసేపటికే లక్షలాది వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే ఈ వీడియోను 41 లక్షల మందికి పైగా చూశారు.
View this post on Instagram
Sabja Seeds : కండరాలు, ఎముకలను బలోపేతం చేయటంతోపాటు, దీర్ఘకాలిక వ్యాధులను నివారించే సబ్జా గింజలు!