వైరల్ వీడియో: WHAT AN IDEA.. మాస్క్ పెట్టుకుని ఇలా కూడా తినొచ్చా?

  • Published By: vamsi ,Published On : November 21, 2020 / 04:59 PM IST
వైరల్ వీడియో: WHAT AN IDEA.. మాస్క్ పెట్టుకుని ఇలా కూడా తినొచ్చా?

Updated On : November 21, 2020 / 5:14 PM IST

కరోనా వైరస్ కారణంగా నిత్య జీవితంలో మాస్క్ అనేది అనివార్యం అయిన పరిస్థితి. చిన్న పిల్లలు దగ్గర నుంచి పెద్దల వరకు ఇప్పుడు వైరస్ కారణంగా బయటకు మాస్క్ లేకుండా బయటకు రాలేకపోతున్నారు ప్రజలు.

ఈ క్రమంలోనే బయట తినే పరిస్థితి వస్తే కాస్త ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితిలో ఓ చిన్న పిల్లవాడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.



లాలీపాప్ తినడం కోసం చేతులతో మాస్కును తీయడం కష్టంగా భావించి కొత్త ఆలోచన చేశాడు. ముఖానికి సర్జికల్‌ మాస్కు ధరించే మందే తనకు నచ్చిన లాలిపాప్‌ను మాస్కు బయటి నుంచి గుచ్చి నోట్లో పెట్టుకుని కనిపించాడు.

మాస్క్ పెట్టుకొని, అటు ఎంచక్కా తన లాలీపాప్ తింటూ ఎంజాయ్‌ చేశారు. ఈ పిల్లవాడి వీడియో చాలా సరదాగా ఉంది. ఇది చూసిన నెటిజన్లు బుడ్డోడి ఐడియా భలే ఉందని అంటున్నారు.