AP Heatwaves: ఇటు మండిపోయే ఎండలు, అటు పిడుగుల వర్షాలు.. రాష్ట్రంలో భిన్న వాతావరణం.. మరో 3 రోజులు..
ఈ తరహా వాతావరణం మరో 3 రోజులు ఉంటుందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉంటుందని, మరికొన్ని చోట్ల పిడుగులతో వర్షాలు పడతాయని అంచనా వేసింది.
AP Heatwaves: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డ్ స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మరోవైపు పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. పిడుగులతో కూడిన వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. భిన్నమైన వాతావరణానికి సంబంధించి విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ ఇచ్చింది. ఈ తరహా వాతావరణం మరో 3 రోజులు ఉంటుందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉంటుందని, మరికొన్ని చోట్ల పిడుగులతో వర్షాలు పడతాయని అంచనా వేసింది.
మే 5న వానలు..
ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం. పిడుగులు కూడిన వర్షాలు పడే ఛాన్స్.
శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.
హెచ్చరికలు:
* పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకండి
* రైతులు, కూలీలు, పశుకాపరులు జాగ్రత్తలు తప్పనిసరి
ఎండ తీవ్రత కొనసాగుతుంది:
* పలు జిల్లాల్లో 41°C పైగా ఉష్ణోగ్రతలు
అత్యధికంగా:
* పెద్దపారుపూడి (కృష్ణా): 43.9°C
* విజయవాడ (ఎన్టీఆర్): 43.1°C
* దొర్నిపాడు (నంద్యాల): 42.9°C
మొత్తం 74 మండలాల్లో ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
సూచన:
* ఎండ, ఉక్కపోత నుంచి రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలి.
* నీళ్లు ఎక్కువగా తాగాలి. మధ్యాహ్నం బయటకు వెళ్లడం తగ్గించాలి.
Also Read: స్టాలిన్ని మట్టికరిపించింది ఈయనే.. విజయ్ వదిలిన బాణం..
