తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈసారి కుమ్మేయనున్న వానలు..!

ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన వాన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈసారి కుమ్మేయనున్న వానలు..!

Telangana Rains (Photo Credit : Google)

Updated On : June 13, 2024 / 3:49 PM IST

Telangana Rains : తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సీజన్ లో రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మధ్య బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడిందని తెలిపారు. తెలంగాణకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన వాన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ.. హైదరాబాద్ కు మోస్తారు వర్ష సూచన చేసింది.

హైదరాబాద్ లో ఉదయం నుంచి ఎండ కాసింది. సడెన్ గా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. 2 3 గంటల వరకు హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంది. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఐఎండీ చేసిన వర్ష సూచనతో GHMC, సంబంధిత అధికారులను అలెర్ట్ అయ్యారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. చార్మినార్, రాజేంద్రనగర్, అంబర్ పేట, కాప్రా, ఉప్పల్, మల్కాజ్ గిరి ప్రాంతాల్లో వాన పడుతోంది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది.

Also Read : హైద‌రాబాద్‌లో వాటి జోలికి వెళ్లకండి..! వెళ్లారో జైలుకే..