Delivery In Plane Toilet : వార్నీ.. తాను గర్భవతిని అని బిడ్డ పుట్టే వరకు తెలియలేదు, చిత్ర విచిత్రం

ఓ బిడ్డకు జన్మనిచ్చేంతవరకు తాను గర్భవతిని అన్న సంగతే ఆమెకు తెలియదంటే అతిశయోక్తి కాదు. అవును నిజమే. ఓ బిడ్డకు జన్మనిచ్చే వరకు ఆమెకే తెలియదు తాను గర్భం దాల్చానని. (Delivery In Plane Toilet)

Delivery In Plane Toilet : వార్నీ.. తాను గర్భవతిని అని బిడ్డ పుట్టే వరకు తెలియలేదు, చిత్ర విచిత్రం

Delivery In Plane Toilet : మహిళ గర్భం దాలిస్తే… ఆ విషయం ఆమెకు ఇట్టే తెలిసిపోతుంది. శరీరంలో అనూహ్య మార్పులు వస్తాయి. నెల నెల కడుపు సైజు పెరుగుతూ పోతుంది. మనిషిని చూడగానే ఆమె గర్భవతి అని చూసే వాళ్లకి కూడా తెలిసిపోతుంది. గర్భం దాల్చిన అలాంటి క్షణాన్ని ఏ మహిళ కూడా తన జీవితంలో మర్చిపోదు. కానీ ఓ మహిళకు చిత్ర విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఓ బిడ్డకు జన్మనిచ్చేంతవరకు తాను గర్భవతిని అన్న సంగతే ఆమెకు తెలియదంటే అతిశయోక్తి కాదు. అవును నిజమే. ఓ బిడ్డకు జన్మనిచ్చే వరకు ఆమెకే తెలియదు తాను గర్భం దాల్చానని.

Also Read..Heart Attack : ఈ లక్షణాలు కనిపిస్తే గుండె పోటుగా అనుమానించాల్సిందే?

ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. విమానంలో వెళ్తున్న ఓ మహిళకు ఇలాంటి విచిత్రమైన అనుభవం ఎదురైంది. తమరా అనే మహిళ ఈక్వెడార్ నుంచి స్పెయిన్ కు విమానంలో వెళ్తోంది. విమానం గాల్లో ఉండగానే ఆమెకు కడుపులో నొప్పిగా అనిపించింది. దీంతో వాష్ రూమ్ కు వెళ్లింది. ఆ వాష్ రూమ్ లోనే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె షాక్ కి గురైంది. ప్రెగెన్నీ వచ్చిన విషయం బిడ్డ పుట్టే వరకు కూడా ఆమెకు తెలియకపోవడం విడ్డూరం. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. విమానం ల్యాండ్ కాగానే తల్లీ బిడ్డలను ఆస్పత్రికి తరలించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తమరా ప్రయాణిస్తున్న అదే విమానంలో లక్కీగా ఇద్దరు డాక్టర్లు, ఒక నర్సు ఉన్నారు. వారు ఆస్ట్రియాకు చెందిన వారు. ప్రసవం విషయంలో వారంతా తమరాకు సాయం చేశారు. తమరా తన బిడ్డకు మాక్సిమిలియానో ​​అని పేరు పెట్టింది. తను బిడ్డను సురక్షితంగా ప్రసవించడంలో సహాయం చేసిన తోటి ప్రయాణికురాలి పేరునే తమరా తన బిడ్డకు పెట్టుకోవడ విశేషం.

Also Read..Tamil Nadu: ట్రక్కు తాడు మెడకు చుట్టుకుని రోడ్డుపై ఎగిరి పడ్డ బైకర్.. అనూహ్య ఘటన

ఇటీవల ఒక అమెరికన్ మహిళ సైతం ఇలానే.. మెక్ డొనాల్డ్స్ ఫుడ్ ఔట్ లెట్ కి చెందిన వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆసుపత్రికి వెళ్లే మార్గంలో బాత్ రూమ్ అర్జంట్ కావడంతో మెక్ డొనాల్డ్స్ లో ఆగింది. అదే సమయంలో అక్కడి వాష్ రూమ్ లోనే ఆమెకు అత్యవసర డెలివరీ జరిగింది. ఆ మహిళ తన బిడ్డకు “చిన్న నగెట్” అని పేరు పెట్టుకుంది.

Also Read..Late Age Pregnant : లేటు వయస్సులో గర్భందాల్చటం శ్రేయస్కరమేనా? గర్భదారణ ఏ వయసులో అనువైనదంటే?

ఈ మధ్య కాలంలో ఈ తరహా మిరాకిల్స్ ఎక్కువయ్యాయి. బిడ్డ పుట్టే వరకు తాము గర్భం దాల్చాము అనే విషయం ఆ మహిళలకే తెలియకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.