Hansal Mehta : కొన్ని ఫ్లాప్స్ ఉండొచ్చు.. కానీ బాలీవుడ్ సూపర్ పొజిషన్ లో ఉంది..
బాలీవుడ్ గత సంవత్సర కాలం నుంచి ఫ్లాప్ సినిమాలనే చూస్తుంది. ఏ సినిమా వచ్చినా, ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా వచ్చినా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. మధ్యలో ఒకటో, రెండో సినిమాలు మాత్రం హిట్ కొడుతున్నాయి. బాలీవుడ్ వరుస పరాజయాలు................

Hansal Mehta : బాలీవుడ్ గత సంవత్సర కాలం నుంచి ఫ్లాప్ సినిమాలనే చూస్తుంది. ఏ సినిమా వచ్చినా, ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా వచ్చినా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. మధ్యలో ఒకటో, రెండో సినిమాలు మాత్రం హిట్ కొడుతున్నాయి. బాలీవుడ్ వరుస పరాజయాలు ఎదుర్కుంటున్న సమయంలో సౌత్ సినిమాలు అక్కడ విజృంభిస్తున్నాయి. భారీ హిట్స్ కొట్టి కలెక్షన్స్ సాధిస్తున్నాయి.
అయితే బాలీవుడ్ ఫ్లాప్స్ లో ఉంది, బాలీవుడ్ పడిపోయింది అంటే మాత్రం అక్కడి స్టార్స్ కొంతమంది ఒప్పుకోవట్లేదు. కొంతమంది మాత్రం బాలీవుడ్ చేంజ్ అవ్వాలి అని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఓ సీనియర్ డైరెక్టర్ బాలీవుడ్ బాగానే ఉంది అంటూ ట్వీట్ చేశాడు. బాలీవుడ్ లో పలు సినిమాలు, సిరీస్ లు తెరకెక్కించిన డైరెక్టర్ హన్సల్ మెహతా ఓ ట్వీట్ చేశారు.
హన్సల్ మెహతా తన ట్వీట్ లో.. ”ప్రస్తుతం మన బాలీవుడ్ గొప్ప పొజిషన్ లో ఉంది. దృశ్యం 2, ఫ్రెడ్డీ, భేడియా, యాన్ యాక్షన్ హీరో.. ఇలా అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు మిస్ అవ్వొచ్చు కానీ అన్ని సినిమాలు మంచి కంటెంట్ తో ఎంతో ఇష్టంగా తెరకెక్కించినవే. అందరూ చెప్తున్నారు బాలీవుడ్ బాగుంది అని” అంటూ పోస్ట్ చేశారు.
అయితే హన్సల్ మెహతా ట్వీట్ కి భిన్నమైన రిప్లైలు వస్తున్నాయి. బాలీవుడ్ లో హిట్ సినిమాలు ఎక్కడ ఉన్నాయి అంటూ కొంతమంది ట్రోల్ చేస్తుంటే, కొంతమంది మాత్రం అవును బాలీవుడ్ బాగానే ఉంది, ఫామ్ లో ఉంది అంటూ సపోర్ట్ చేస్తున్నారు.
Our industry is having a great time at the movies – #MonicaOMyDarling #Drishyam2 #Uunchai #Bhediya #Freddy #AnActionHero and #Qala. Some hits, some misses but all appreciated films, made with passion and telling all those doomsayers that ALL IZ WELL!
— Hansal Mehta (@mehtahansal) December 4, 2022