Ivanka Trump: 2024 ఎన్నికల్లో నా తండ్రి ట్రంప్ తరపున ప్రచారంలో పాల్గొనను.. ఇవాంక్ ట్రంప్ కీలక ప్రకటన..

2024లో వైట్ హౌస్‌ను తిరిగి కైవసం చేసుకునేందుకు తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నంలో నేను భాగస్వామినికానని, తన తండ్రి ప్రచారంలో అసలు జోక్యం చేసుకోనని డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ స్పష్టం చేసింది. నేను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలిపింది.

Ivanka Trump: 2024 ఎన్నికల్లో నా తండ్రి ట్రంప్ తరపున ప్రచారంలో పాల్గొనను.. ఇవాంక్ ట్రంప్ కీలక ప్రకటన..

IVANKA Trump

Ivanka Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల సమరాన్ని మోగించారు. అమెరికాలో తదుపరి అధ్యక్ష ఎన్నికలు 2024లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటి నుంచే ఎన్నికల్లో విజయం కోసం ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆయన యోచిస్తున్నారు. ట్రంప్ పేరు చెప్పగానే అతని కుమార్తె ఇవాంకా ట్రంప్ పేరు కీలకంగా వినిపిస్తుంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ఆమె కీలక భూమిక పోషించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేశారు. పలు దేశాల్లో అధికారిక హోదాల్లో పర్యటనలు సైతం చేశారు. ఇండియాలోని తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఆమె అప్పట్లో పర్యటించారు.

2024 US President Election: ‘అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాను’.. ‘నేను సిద్ధం’ అంటూ అధికారికంగా ట్రంప్ ప్రకటన

ట్రంప్ మళ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతుంటే.. ఇవాంకా ట్రంప్ మాత్రం నేను రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. 2024లో వైట్ హౌస్‌ను తిరిగి కైవసం చేసుకునేందుకు తన తండ్రి చేస్తున్న ప్రయత్నంలో నేను భాగస్వామినికానని, తన తండ్రి ప్రచారంలో అసలు జోక్యం చేసుకోనని స్పష్టం చేసింది. “నా పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని ఇవాంకా తెలిపింది.

Ivanka Trump’s Emotional Plea: ‘దయచేసి వద్దు నాన్నా.. పోటీ చేయొద్దు’.. అంటూ డొనాల్డ్ ట్రంప్‌ను బతిమిలాడిన ఇవాంక

డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో రిసార్ట్‌లో రిపబ్లికన్ నామినేషన్ కోసం తన 2024 బిడ్‌ను ప్రారంభించారు. అతని భార్య మెలానియా, కుమారుడు ఎరిక్‌తో సహా అతని కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇవాంక భర్త జారెడ్ కుష్నర్ కూడా హాజరయ్యారు. అయితే ఇవాంక ట్రంప్ ట్రంప్ పై తన ప్రేమను వ్యక్తం చేశారు. “నేను మా నాన్నను చాలా ప్రేమిస్తున్నాను. ఈ సమయంలో నేను నా చిన్న పిల్లలకు, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఎంచుకుంటున్నాను. అందుకే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నాకు లేదు. 2024 కోసం తన తండ్రి చేసే ప్రచారంలో అందుకే పాల్గొనడం లేదని ఇవాంకా ట్రంప్ స్పష్టత ఇచ్చారు.