2024 US President Election: ‘అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాను’.. ‘నేను సిద్ధం’ అంటూ అధికారికంగా ట్రంప్ ప్రకటన

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో తాను నిలుస్తానని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (76) ప్రకటించారు. అమెరికాలో తదుపరి అధ్యక్ష ఎన్నికలు 2024లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని అధికారికంగా ప్రకటించిన తొలి అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు.

2024 US President Election: ‘అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాను’.. ‘నేను సిద్ధం’ అంటూ అధికారికంగా ట్రంప్ ప్రకటన

Donald Trump

Updated On : November 16, 2022 / 8:50 AM IST

2024 US President Election: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో తాను నిలుస్తానని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (76) ప్రకటించారు. అమెరికాలో తదుపరి అధ్యక్ష ఎన్నికలు 2024లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని అధికారికంగా ప్రకటించిన తొలి అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. ఈ నెల 15న ఓ ప్రకటన చేస్తానంటూ ఆయన కొన్ని రోజుల క్రితం తెలిపిన విషయం తెలిసిందే. ఆయన మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.

ఇప్పుడు అదే నిజమైంది. అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ట్రంప్ ఇవాళ అభ్యర్థిత్వంపై ‘నేను సిద్ధం’ అంటూ ప్రకటన చేశారు. ఇప్పటి నుంచే ఎన్నికల్లో విజయం కోసం ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆయన యోచిస్తున్నారు. ట్రంప్ 2016 రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేసి అధ్యక్షుడిగా విజయం సాధించారు.

అప్పట్లో డెమోక్రటిక్ నేత ట్రంప్ హిల్లరీ క్లింటన్ చేతిలో ట్రంప్ ఓడిపోతారని అందరూ భావించారు. అయితే, అందులో ఘన విజయం సాధించి ట్రంప్ అందరినీ ఆశ్చర్యపరిచారు. 2020లో రెండోసారి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి జో బైడెన్‌ చేతిలో ఓడిపోయారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..