Ivanka Trump’s Emotional Plea: ‘దయచేసి వద్దు నాన్నా.. పోటీ చేయొద్దు’.. అంటూ డొనాల్డ్ ట్రంప్‌ను బతిమిలాడిన ఇవాంక

అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో మరోసారి పోటీ చేయొద్దని తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ ను ఇవాంకా ట్రంప్ బతిమిలాడుకున్నారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమానికి ట్రంప్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ను ఇవాంకా పక్కకు తీసుకు వెళ్ళి మాట్లాడారు. తన మనసులో ఉన్న విషయాన్ని తండ్రికి చెప్పారు. ''దయచేసి వద్దు నాన్నా.. పోటీ చేయొద్దు..'' అని వేడుకున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి తమ కుటుంబంపైనే ఉందని, తన ముగ్గురి పిల్లలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశమూ ఉందని ఆమె చెప్పారు. ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు ఫ్లోరిడాలోని డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో ఇటీవల తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.

Ivanka Trump’s Emotional Plea: ‘దయచేసి వద్దు నాన్నా.. పోటీ చేయొద్దు’.. అంటూ డొనాల్డ్ ట్రంప్‌ను బతిమిలాడిన ఇవాంక

Trump's India visit

Ivanka Trump’s Emotional Plea:  అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో మరోసారి పోటీ చేయొద్దని తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ ను ఇవాంకా ట్రంప్ బతిమిలాడుకున్నారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమానికి ట్రంప్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ను ఇవాంకా పక్కకు తీసుకు వెళ్ళి మాట్లాడారు. తన మనసులో ఉన్న విషయాన్ని తండ్రికి చెప్పారు. ”దయచేసి వద్దు నాన్నా.. పోటీ చేయొద్దు..” అని వేడుకున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి తమ కుటుంబంపైనే ఉందని, తన ముగ్గురి పిల్లలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశమూ ఉందని ఆమె చెప్పారు. ఆ లోపు ఇవాంకా పిల్లలు ఆమె వద్దకు వచ్చారు.

తమ తాత డొనాల్డ్ ట్రంప్ తో ఇంతగా ఏం మాట్లాడుతున్నావని అడిగారు. అయితే, వారి ప్రశ్నలకు ఇవాంక సరైన సమాధానాలు చెప్పలేదు. ఈ విషయాలను ఓ మీడియా సంస్థ బయటపెట్టింది. డొనాల్డ్ ట్రంప్, ఇవానా ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్. ఇవానా ట్రంప్ గత నెల మృతి చెందిన విషయం తెలిసిందే. 2005లో మెలానియా ట్రంప్ ను డొనాల్డ్ ట్రంప్ పెళ్ళి చేసుకున్నాడు. 2024లో డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయొద్దని మెలినియా కూడా సూచిస్తున్నారు. ఆమెకు ఇవాంక మద్దతు తెలుపుతున్నారు. ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు ఫ్లోరిడాలోని డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో ఇటీవల తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొన్ని అధికారిక పత్రాల దుర్వినియోగం కేసులో ఈ తనిఖీలు చేశారు. ఈ తనిఖీలు ఇప్పట్లో ఆగబోవని ట్రంప్ కుటుంబంలో ఆందోళన నెలకొంది. దేశ న్యాయ వ్యవస్థను అధ్యక్షుడు బైెడెన్ ప్రభుత్వం ఆయుధంలా వాడుకుంటోందని ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికలు 2024లో జరగనున్న వేళ పోటీ చేయడానికి ట్రంప్ సిద్ధమవుతున్నారు. దీంతో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మెలానియా ట్రంప్, ఇవాంక ఆందోళన చెందుతున్నారు. అందుకే డొనాల్డ్ ట్రంప్ ను 2024లో అధ్యక్ష పదవికి పోటీ చేయొద్దని బతిమిలాడుకుంటున్నారు. ఇటీవల ఎఫ్‌బీఐ చేసిన దాడులు ప్రారంభం మాత్రమేనని ఇవాంక భావిస్తోంది.

Shirdi Saibaba Temple: షిర్డీ సాయిబాబాకు రూ.36.98 లక్షల విలువజేసే బంగారు కిరీటాన్ని విరాళంగా అందించిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్