Bhagalpur bridge collapse: కుప్పకూలిన వంతెన..కాంట్రాక్టు సంస్థపై సీఎం నితీష్ కుమార్ ఆగ్రహం, విచారణకు ఆదేశం

భాగల్‌పూర్ కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆయన ఆదేశించారు.

Bhagalpur bridge collapse: కుప్పకూలిన వంతెన..కాంట్రాక్టు సంస్థపై సీఎం నితీష్ కుమార్ ఆగ్రహం, విచారణకు ఆదేశం

Bhagalpur bridge collapse

Bhagalpur bridge collapse: భాగల్‌పూర్ వంతెన కుప్పకూలిన ఘటనపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగానదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి రెండు సార్లు కుప్పకూలడంపై(Bhagalpur bridge collapse) విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.నిర్మాణ సంస్థ వంతెన నిర్మాణపనులు సరిగా చేయడం లేదని సీఎం చెప్పారు.(Nitish raps construction firm) ఇప్పటికే రూ.1717 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టగా, రెండు సార్లు కూలిపోయింది.బ్రిడ్జి నాసిరకంగా నిర్మాణానికి కంపెనీదే బాధ్యత(Thik nahi bana raha hai) అని నితీశ్ కుమార్ అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరామని బీహార్ సీఎం చెప్పారు.

Another rail accident : ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

వంతెన కూలిపోవడానికి కారణమైన వారిని గుర్తించాలని సీఎం కోరారు. దీనిపై పుల్ నిర్మాణ్ నిగమ్ నుంచి నివేదిక కోరారు. ఈ వంతెన కూలిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. వంతెన కూలుతుండగా అక్కడే ఉన్న కొందరు స్థానికులు వీడియో తీశారు. వంతెన కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Sweden first ever European Championship: ఇక శృంగారం కూడా అధికారిక క్రీడగా స్వీడన్ గుర్తింపు…6 వారాల పాటు మొట్టమొదటి యూరోపియన్ ఛాంపియన్‌షిప్

బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.అగువానీ-సుల్తాన్‌గంజ్ గంగా వంతెన పనులు 2014లో ప్రారంభమయ్యాయి.ఈ వంతెన పూర్తి చేయడానికి గడువు ఎనిమిది సార్లు విఫలమైంది. 2022 ఏప్రిల్‌లో తుపాను కారణంగా వంతెన కొంత దెబ్బతింది.