మామయ్యలకు ఆల్ ద బెస్ట్ : నాగబాబుకి అల్లు అర్జున్ మద్దతు

హైదరాబాద్ : ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ తరఫున సినీ నటుడు, మెగా ఫ్యామిలీ మెంబర్ అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్న వేళ.. అల్లు అర్జున్

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 01:32 PM IST
మామయ్యలకు ఆల్ ద బెస్ట్ :  నాగబాబుకి అల్లు అర్జున్ మద్దతు

హైదరాబాద్ : ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ తరఫున సినీ నటుడు, మెగా ఫ్యామిలీ మెంబర్ అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్న వేళ.. అల్లు అర్జున్

హైదరాబాద్ : ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ తరఫున సినీ నటుడు, మెగా ఫ్యామిలీ మెంబర్ అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్న వేళ.. బన్నీ క్లారిటీ ఇచ్చారు. ఊహాగానాలకు తెరదించారు. తాను ఎన్నికల ప్రచారంలో లేకపోయినా తన ఫుల్ సపోర్ట్ మాత్రం మామయ్యలు పవన్, నాగబాబుకు ఉంటుందని వెల్లడించారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి, విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. నాగబాబు నర్సాపురం జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారిద్దరికి తన సపోర్ట్ తెలుపుతూ, ఆల్ ద బెస్ట్ చెబుతూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫేస్ బుక్ లో ప్రకటన విడుదల చేశారు. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన నాగబాబుకి అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పారు. పొలిటికల్ జర్నీలో నాగబాబు సక్సెస్ అవ్వాలని ఆకాంక్షించారు. నాగబాబుకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయినా.. మోరల్ గా మీ వెంటే ఉంటామని అల్లు అర్జున్ చెప్పారు. తన సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు.

Read Also : అభిమాని అత్యుత్సాహం..కిందపడ్డ పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా అల్లు అర్జున్ విషెస్ చెప్పారు. పవన్ రాజకీయ ప్రయాణం సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. పవన్ తన డైనమిక్ లీడర్ షిప్ తో, బ్రిలియంట్ విజన్ తో ఏపీ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతారని ఆశిస్తున్నట్టు అల్లు అర్జున్ చెప్పారు.

జనసేన తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న మామయ్యలకు (నాగబాబు, పవన్) మద్దతుగా అల్లు అర్జున్‌, వరుణ్‌తేజ్‌లు ప్రచారం చేస్తారని నాగబాబు భార్య పద్మజ ఇటీవలే ప్రకటించారు. నాగబాబు, పవన్ విజయాన్ని కాంక్షిస్తూ వారిద్దరు ప్రచారం చేస్తారని అంతా అనుకున్నారు. ఇంతలో అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. తాను ప్రచారం చెయ్యడం లేదని ఈ లేఖ ద్వారా స్పష్టం చేశారు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కుటుంబం నుంచి నాగబాబు లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తన బాబాయ్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్‌ మద్దతు మాత్రమే ప్రకటించారు. పవన్‌ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు చెబుతూ తన ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. జనసేన మేనిఫెస్టో అద్భుతం అని, సమాజంలోని అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని, రాజకీయాల్లో ఇదొక నూతన ఒరవడి అని, కళ్యాణ్‌ బాబాయ్‌కి కాంగ్రాట్స్ అంటూ పోస్టు పెట్టారు‌. అలాగే జనసేన అభ్యర్థులందరికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. గాజు గ్లాస్‌ గుర్తుకు ఓటెయ్యండని చరణ్‌ ఫేస్‌బుక్‌లో కోరారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే పని చేశారు.

Read Also : పవన్ కల్యాణ్ కు వడదెబ్బ : ఆందోళనలో అభిమానులు