జగన్ మరో సంచలన నిర్ణయం : ఆర్టీసీ విలీనానికి గ్రీన్ సిగ్నల్

  • Published By: chvmurthy ,Published On : September 3, 2019 / 12:47 PM IST
జగన్ మరో సంచలన నిర్ణయం : ఆర్టీసీ విలీనానికి గ్రీన్ సిగ్నల్

అమరావతి :  ఏపీఎస్ ఆర్టీసీ  ఉద్యోగుల కల నెరవేరబోతోంది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు జగన్ ఆమోదం తెలిపారు. బుధవారం సెప్టెంబరు 4న  ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని రవాణాశాఖా మంత్రి పేర్నినాని చెప్పారు.  

ఎన్నాళ్ల నుంచో ఉద్యోగ భద్రత కోరుకుంటున్న ఆర్టీసి ఉద్యోగుల కోరికసీఎం జగన్ ఇప్పుడు తీర్చారు. ప్రతి సంవత్సరం ఉద్యోగుల జీతభత్యాల కోసం ఆర్టీసీ పై దాదాపు రూ.3300 నుంచి రూ.3500 కోట్ల భారం పడుతుంది. దాన్ని భరించటానికి ప్రభుత్వం సిధ్దంగా ఉందని మంత్రి నాని తెలిపారు. 

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసి అందులో ఆర్టీసీ ఉద్యోగులను భాగస్వాములను చేస్తామని మంత్రి తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలని సీయం తెలిపారని నాని వివరించారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికుల సౌకర్యం కోసం తీసుకువస్తున్నామని వాటి గురించి  ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.