పదేళ్లుగా పట్టించుకోవడం లేదు: MRO కార్యాలయం ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం

  • Edited By: veegamteam , November 13, 2019 / 12:03 PM IST
పదేళ్లుగా పట్టించుకోవడం లేదు: MRO కార్యాలయం ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం

తహశీల్దార్ కార్యాలయం ఎదుట దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. ఓ భూమి విషయంలో తహశీల్దార్ కార్యాయలం చుట్టు గత పదేళ్ల నుంచి తిరుగుతున్నా పట్టించుకోవటంలేదనీ దంపతులిద్దరు పెట్రోల్ బాటిల్ తో కార్యాలయానికి చేరుకున్నారు. తమ సమస్య పరిష్కరించకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. దీంతో ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర  టెన్షన్ వాతావరణం నెలకొంది.

వివరాలు..బత్తులూరుకు చెందిన సుబ్బారెడ్డి, అతని భార్య రమాదేవి  పురుగుల మందు, పెట్రోల్ బాటిత్ పట్టుకుని  ఆళగడ్డ ఎమ్మార్వో ఆఫీస్ కు వచ్చారు.  10 సంవత్సరాలు ఎంతోమంది అధికారులు వస్తున్నారు..పోతున్నారు కానీ ఇప్పటి వరకూ తమ భూమికి సంబంధించి ఎటువంటి పరిష్కారాన్ని చూపించలేదని వాపోయిందామె.  ఆమె చేతిలో పురుగుల మందు బాటిల్,పెట్రోల్ బాటిల్ చూసిన తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది హడలిపోయారు. స్థానికులు వారించారు.

అయినా వినిపించుకోని సదరు మహిళ ఈరోజు తమకు పూర్తి పరిష్కారం చూపించాల్సిందనంటూ పట్టుబట్టింది. ఆమె చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్ తీసుకునందుకు సిబ్బంది యత్నించినా ఆమె తన పట్టు విడవలేదు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.హుటాహుటిన ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చిన పోలీసులు..ఎమ్మార్వో కలిసి దంపతులిద్దరికి నచ్చచెప్పటంతో పరిస్థితి సర్ధుమణిగింది.