ఒంటరిగానే కాంగ్రెస్ : టీడీపీతో పొత్తు లేదు – చాందీ

  • Published By: madhu ,Published On : January 23, 2019 / 11:06 AM IST
ఒంటరిగానే కాంగ్రెస్ : టీడీపీతో పొత్తు లేదు – చాందీ

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. అన్ని పార్టీలు ఎన్నికల దానిపై వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల బరిలో నిలిచేందుకు నేతలు సమాయత్తం అవుతున్నారు. టికెట్ కన్ఫామ్ అవుతుందా ? లేదా ? అనేది చూసుకుంటూ…నేతలు వివిధ పార్టీల్లోకి జంప్ అయితున్నారు. పార్టీల మధ్య పొత్తుల చర్చలు షురూ అవుతున్నాయి. ఈసారి టీడీపీ అధికారంలోకి రాకుండా చేయాలని పార్టీలన్నీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. వామపక్షాలతోనే వెళుతామని జనసేన వెల్లడించిన సంగతి తెలిసిందే. మరి కాంగ్రెస్ ఒంటిరిగా బరిలోకి దిగుతుందా ? లేక టీడీపీతో జత కడుతుందా అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. 
తెలంగాణలో పొత్తు..ఇక్కడ లేదు : 
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సైకిలెక్కింది. బాబు..రాహుల్…ఇతర కీలక నేతలు కలిసి ప్రచారం కూడా నిర్వహించారు. ఈ పొత్తు అక్కడ బెడిసికొట్టింది. ఏపీలో కూడా పొత్తు ఉంటుందా ? అనే చర్చ సాగింది. దీనిపై జనవరి 23వ తేదీ బుధవారం కాంగ్రెస్ కీలక నిర్ణయం వెలువరించింది. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని…కాంగ్రెస్ – టీడీపీ మధ్య పొత్తు లేదని ఉమెన్ చాందీ స్పష్టం చేశారు. 175 అసెంబ్లీ…25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఫిబ్రవరిలో కాంగ్రెస్ బస్సు యాత్ర ఉంటుందని…13 జిల్లాలో యాత్ర ఉంటుందని..జనవరి 31వ తేదీన జరిగే భేటీలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే ఏపీకి మేలు జరుగుతుందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా వ్యాఖ్యానించారు. జనవరి 31న జరిగే నియోజకవర్గ…పార్లమెంట్ కన్వీనర్ల భేటీలో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.