లాక్ డౌన్ లో భారీగా పెరిగిన బాల్య వివాహాలు

  • Published By: nagamani ,Published On : August 28, 2020 / 03:46 PM IST
లాక్ డౌన్ లో భారీగా పెరిగిన బాల్య వివాహాలు

కరోనా కాలంలో సాధారణ వివాహాలు చేసుకోవటానికి ఒకటికి పది సార్లు..100 రకాలుగా ఆలోచించాల్సి వస్తోంది. కానీ పాపిష్టిపనులను ఏకాలం అయినా ఒకట్టే అన్నట్లుగా సందట్లో సడేమియాలాగా ఈ కరోనా కాలంలో కర్ణాటక రాష్ట్రంలో బాల్య వివాహాల సంఖ్య పెరిగిందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వెల్లడించింది.



గుట్టుచప్పుడు కాకుండా చిన్నారులను పెళ్లిపీటలెక్కించి వారి గొంతులు కోస్తున్నారని తెలిపింది. గత ఐదు నెలల్లో కర్ణాటక రాష్ట్రం వ్యాప్తంగా భారీ సంఖ్యలో బాల్య వివాహాలు జరిగాయని తేలిందని తెలిపింది కమిషన్.

గత ఏప్రిల్ నుంచి జూలై వరకు 107 మందికి పెళ్లిలు చేసినట్టుగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గుర్తించింది. 2019లో మొత్తం 156 జరగా..2020 లో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ కేవలం ఐదు నెలల్లోనే ఈ స్థాయిలో ఉండటం విశేషం.



అధికారులు అంతా కరోనా సహాయకచర్యల్లో ఉన్న సమయంలో అధికారుల దృష్టికి ఇవి రాలేదనీ..దీన్నితమకు అనుకూలంగా మార్చుకుంటుకుని బాల్య వివాహాలు జరిపించేస్తున్నారని తెలిపారు. బళ్ళారి, మైసూరు, బాగల్‌కోట్, ధార్వాడ్, బెళగావి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనే వీటి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు.
https://10tv.in/villagers-fight-because-for-coronavirus-in-khammam/
లాక్‌డౌన్ కారణంగా పిల్లలు స్కూల్స్ మూసివేయడం కూడా ఈ బాల్య వివాహాలకు కారణమని తేలింది. మార్చి నుంచి జులై వరకు 550 బ్యాల వివాహాలను ఆపగలిగామని తెలిపారు. కాగా పెళ్లి అంటే గతంలో ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చేది.కానీ లాక్‌డౌన్ సమయంలో అదేది లేకపోవడంతో కుటుంబ సభ్యుల మధ్యే జరగడంతో చాలా కేసులు బయటకు రాలేదన్నారు.