శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ

  • Published By: veegamteam ,Published On : October 3, 2019 / 02:56 AM IST
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ

దేవీ నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కనక దుర్గమ్మ ఐదవరోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిపురాత్రయంలో లలితాదేవి అవతారం రెండవ శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్యదేవతగా పూజలందుకుంటోంది. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో అమ్మవారు ఐదవ రోజున దర్శనమిస్తోంది. లలితాదేవి  అవతారంలో ఉన్న అమ్మను పూజిస్తే..సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు. 
 లలితాదేవి అంటే శాంతమూర్తి ఈ రూపంలో కొలువైన  అమ్మవారి పూజిస్తే..సౌమ్యత్వాన్ని పెంచుతుంది.అంటే శాంతస్వభావాన్ని సిద్ధింపజేస్తుంది. భక్తులకు మోక్షలను ప్రసాదిస్తుంది. లలితాఅమ్మవారి శక్తిని ఖడ్గమాలగా కూడా కొలిచే సంప్రదాయ కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది.

లలితా త్రిపుర సుందరి దేవికి  ఈ రోజు ఎరుపురంగు వస్త్రాలను ధరించి పూజిస్తే శుభం కలుగుతుందారు. లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి నైవేద్యం దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.  అందులో పెరుగు, మిరియాలు, జీలకర్రను ఉపయోగిస్తారు. మిరియాలు మన శరీరంలోని వేడిని పెంచి కఫాన్ని తగ్గిస్తుంది. ఇలా లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని పూజిస్తే కుటుంబపరంగాను..శారీరకంగాను..మానసికంగా మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.