షర్మిలతో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే భేటీ

10TV Telugu News

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం సోదరి వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ షర్మిలను కలవడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరమైన చర్చకు కారణం అవుతోంది.

షర్మిల వరుసగా.. తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తుండగా.. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా నేతలతో వైఎస్ షర్మిళ సమావేశం జరిగింది. ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని ఆమె నిర్ణయించారు. ఆత్మీయ సమ్మేళనం తర్వాత షర్మిలతో ఆళ్ల భేటీ కావడంతో మీటింగ్‌కు ప్రాధాన్యత దక్కింది.

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టే దిశగా.. షర్మిల అడుగులు వేస్తుండగా.. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. లోటస్ పాండ్‌లో షర్మిల, అనీల్‌తో సమావేశమైన ఆర్కే, అనంతరం మాట్లాడుతూ.. వైఎస్ కుమార్తెగా షర్మిల అంటే తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. భేటి వెను ఎటువంటి రాజకీయ కోణం లేదని స్పష్టంచేశారు. వైఎస్ కుమార్తెగా ఆమె అంటే ఉన్న అభిమానంతోనే మర్యాదపూర్వకంగా షర్మిలను కలిసినట్లుగా చెప్పుకొచ్చారు.

10TV Telugu News