Polar Bear: ఏం తెలివి! మంచు ఫలక పగలకుండా ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి

మూగజీవాలకూ బోలెడంత తెలివి ఉంటుంది. వాటి జీవనానికి అవసరమైన తెలివితేటల్ని అవి కలిగి ఉంటాయి. కావాలంటే ఈ వీడియో చూడండి. మంచు ఫలకలపై వెళ్లే ఒక ధృవపు ఎలుగబంటి ఆ ఫలకలు పగలకుండా ఎలా నడిచిందో చూడండి.

Polar Bear: ఏం తెలివి! మంచు ఫలక పగలకుండా ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి

Polar Bear: వణ్యప్రాణులు, మూగ జీవాలకు బతుకంతా ఒక సవాలే. ఎప్పటికప్పుడు ప్రకృతిని, పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ బతకాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అందుకే కొన్ని జీవులు అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తుంటాయి.

Class 9 Girl: పరీక్షలో కాపీ కొడుతుందని అనుమానం.. బాలిక దుస్తులు విప్పించిన టీచర్.. అవమానంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

తాజాగా ఇలాంటి అంశానికి సంబంధించిన ఒక వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మంచు పర్వత ప్రాంతాల్లో ఉండే సరస్సులు కూడా కొన్నిసార్లు గడ్డకడతాయనే సంగతి తెలిసిందే. పైన మంచు గట్టిగా, ఒక పొరలా ఉంటుంది. కానీ, దాని అడుగు భాగంలో మొత్తం నీళ్లే ఉంటాయి. ఈ మంచు ఫలకలపై నడుచుకుంటూ వెళ్లడం మంచిది కాదు. అవి ఏ క్షణమైనా పగిలిపోవచ్చు. అందులోనూ బరువు ఎక్కువైతే, మంచు ఫలకలు వెంటనే పగిలిపోయి, నీటిలో మునిగిపోవాల్సి వస్తుంది. పైగా నీళ్లు అత్యంత చల్లగా ఉంటాయి కాబట్టి ప్రాణాలకే ప్రమాదం. అందుకే మంచు ఫలకలపై జాగ్రత్తగా నడవాలి. మంచుపర్వత ప్రాంతాల్లో ఉండే వ్యక్తులకు దీనిపై అవగాహన ఉంటుంది. కానీ, ఒక ధృవపు ఎలుగుబంటికి కూడా ఈ విషయం తెలిసినట్లుంది.

GN Saibaba: మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టు షాక్.. హైకోర్టు తీర్పు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

అందుకే మంచు ఫలకలపై ఎలా పడితే అలా నడవడం అంత మంచిది కాదని గుర్తించింది. ప్రమాదకరమైన మంచు ఫలకలపై నడవకుండా, నెమ్మదిగా పాకుతూ వెళ్లింది. దీనికి సంబంధించిన దృశ్యాన్ని అక్కడివారెవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. నెటిజన్లు ఈ ఎలుగుబంటి తెలివిని మెచ్చుకుంటున్నారు.