GN Saibaba: మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టు షాక్.. హైకోర్టు తీర్పు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

మావోయిస్టులతో సంబంధాల విషయంలో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న సాయిబాబాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయనను విడుదల చేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.

GN Saibaba: మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టు షాక్.. హైకోర్టు తీర్పు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

GN Saibaba: మావోయిస్టులతో లింక్ కేసులో మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను విడుదల చేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. హైకోర్టు తీర్పు వెలువడి 24 గంటలు గడవకముందే సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

Boora Narsaiah Goud: టీఆర్ఎస్‌కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా.. బీజేపీలో చేరే అవకాశం?

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు, మరో ఐదుగురిని తక్షణమే విడుదల చేయాలని బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్ శుక్రవారం తీర్పు వెల్లడించింది. అయితే, ఈ తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్ఐఏ వ్యతిరేకించింది. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు శనివారం ప్రత్యేక విచారణ జరిపింది. హైకోర్టు తీర్పును రద్దు చేసింది. సాయిబాబాతోపాటు మిగతా నిందితులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 8న జరుపుతామని వెల్లడించింది. నిందితులపై మోపిన అభియోగాలు చాలా తీవ్రమైనవని, అవి జాతీయ సమగ్రతకు, సమాజానికి ముప్పుగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది.

Class 9 Girl: పరీక్షలో కాపీ కొడుతుందని అనుమానం.. బాలిక దుస్తులు విప్పించిన టీచర్.. అవమానంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

అలాగే సాయిబాబాపై మోపిన అభియోగాల్ని బాంబే హైకోర్టు సరిగ్గా పరిశీలించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు సాయిబాబా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, ఆయనను హౌజ్ అరెస్ట్ చేసి ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. కానీ, దీనికి కూడా సుప్రీం ధర్మాసనం అంగీకరించలేదు. కాగా, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సాయిబాబాకు సుప్రీంకోర్టు ఆదేశించింది.