Seagull : షాప్ లో స్నాక్స్ దొంగతనం చేసిన పక్షి..వీడియో వైరల్

పక్షులు దొంగతనం చేయడం ఎప్పుడైనా చూస్తారా? లేదంటే ఇదిగో ఇక్కడ చూడండి. సీగల్ అనే ఈ పక్షి ఓ షాప్ లోకి వచ్చి స్నాక్స్ ప్యాకెట్ ఎత్తుకెళ్లింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీగల్ పక్షి దొంగతనం దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి.

Seagull : షాప్ లో స్నాక్స్ దొంగతనం చేసిన పక్షి..వీడియో వైరల్

Seagull

Seagull : సీగల్ పక్షికి సంబందించిన అరుదైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు సీగల్ పక్షులు ఓ దుకాణం వద్దకు వచ్చాయి. వీటిలో ఒకటి దుకాణం లోపలికి వెళ్లి ఓ స్నాక్స్ ప్యాకెట్ తీసుకోని బయటకు వచ్చింది. షాప్ లోకి వెళ్లిన పక్షికోసం మరో పక్షి బయట వెయిట్ చేస్తుంది.

ఇక సీగల్ స్నాక్స్ ప్యాకెట్ తీసుకొచ్చే దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలను బ్యూటెంజిబీడెన్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి “మంచిగా వెళ్ళండి, ఎవరూ గమనించరు” అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే మూడు లక్షలకు పైగా వ్యూస్ రాగ 20 వేల లైక్స్ వచ్చాయి. 4000 మంది రీట్వీట్ చేశారు. ఇక ఈ వీడియో చూసినవారు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సీగల్ పక్షి చేస్తున్న దొంగతనం ఆశ్చర్యం కలిగిస్తుంది. సీగల్ షాప్ లోంచి స్నాక్స్ ప్యాకెట్ తీసుకొచ్చి బయట ఉన్న మరోసీగల్ ను తీసుకోని అక్కడినుంచి వెళ్ళిపోయింది.

ఇక ఆ పక్షి అంత ధైర్యంతో షాప్ లోకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మనుషుల మధ్య తిరిగే ఈ పక్షులు గతంలో కూడా ఇటువంటి పనులు చేశాయి. ఓ షాప్ లో స్నాక్స్ ప్యాకెట్ తీసుకోని తుర్రున ఎగిరిపోయాయి.