లక్ష రూపాయలు మ్యాగీ చెప్పల్

  • Published By: veegamteam ,Published On : December 20, 2019 / 05:52 AM IST
లక్ష రూపాయలు మ్యాగీ చెప్పల్

పది సంవత్సరాలుగా మ్యాగీ ఫుడ్ ఇండస్ట్రీలో టాప్ గా ఉంది. చిరుతిళ్లలో, క్షణాల్లో తయారైపోయే స్నాక్స్ లా అమితాదరణ దక్కించుకుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా పెరిగిపోయిన మ్యాగీ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ఓ కార్పొరేట్ కంపెనీ ఆలోచించింది. మ్యాగీ డిజైనుతో చెప్పులను తయారుచేసింది. మ్యాగీ లాగానే ఉంది కదా.. ఏ తక్కువ ధరకో వస్తాయనుకంటే మ్యాగీలో కాలు వేసినట్లే. ఇవి అక్షరాల లక్ష రూపాయల చెప్పులు. 

కొత్త సంవత్సరం కలెక్షన్స్ కోసం ప్రముఖ ఫ్యాషన్ కంపెనీ నూడిల్స్‌తో  ఉన్న చెప్పల్ ఫోటోను విడుదల చేసింది. ఫోటో సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. కాని తినే మ్యాగీ కాళ్లకింద నలిగి పోతుందని అందరు బాధపడుతూ కామెంట్లు  చేస్తున్నారు. ట్రెండ్ కు తగ్గట్లుగా ఉండటం, కొత్తగా అనిపించడంతో ప్రజల్లోకి ఈజీగా వెళ్లిపోయాయి. 

ఆ యువతి ధరించిన చెప్పల్ మ్యాగీ డిజైను పోలి ఉన్నాయి అంతేగాని మ్యాగీతో తయారైనది కాదు. ఈ డిజైను iedtdiet prada అని ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో  ఆ ఫోటో వైరల్ గా మారింది. ఈ చెప్పల్ ను దక్కించుకోవాలంటే లక్ష రూపాయలను ఖర్చ చేయాల్సి ఉంటుంది. కొందరు నెటిజన్లు మాత్రం బాగుందంటూ నవ్వుకున్నారు.మరికొందరు ఏడ్చినట్టు ఉంది నీ బ్రాండ్ అని కామెంట్స్ చేస్తున్నారు.