Rains In Andhra Pradesh : రాగల 48 గంటల్లో ఏపీలో పలు చోట్ల వర్షాలు..ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం  తెలిపింది. 

Rains In Andhra Pradesh : రాగల 48 గంటల్లో ఏపీలో పలు చోట్ల వర్షాలు..ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు

Rains in Telangana

Rains In Andhra Pradesh :  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం  తెలిపింది.   ఇది ప్రస్తుతం   ఒరిస్సా-వెస్ట్ బెంగాల్ తీరాలకు ఆనుకొని ఉన్న బంగాళాఖాతంలో   అల్పపీడనం కేంద్రికృతం అయి ఉంది.

సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని వీటి ప్రభావం వల్ల  రాగల 48 గంటలలో ఏపీలో  పలుచోట్ల ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు,ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురీసే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది.

రాగల నాలుగు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్,ఓరిస్సా,తమిళనాడు,వెస్ట్ బెంగాల్ తీరాల్లో బలమైన గాలులు వీస్తాయని తుఫాను హెచ్చరికల కేంద్రం వివరించింది.

Also Read : Weather update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్ళీ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం