మరో రెండు రోజులు చలితీవ్రత

రాష్ట్రంలో మరో రెండు రోజులు చలి తీవ్రత కొనసాగనుంది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు పడిపోవడమే దీనికి కారణం. మధ్య భారతదేశంపై పశ్చిమ ఆటంకాలు కొనసాగుతుండటంతో అక్కడ కనిష్ట

  • Published By: veegamteam ,Published On : January 22, 2019 / 02:06 AM IST
మరో రెండు రోజులు చలితీవ్రత

రాష్ట్రంలో మరో రెండు రోజులు చలి తీవ్రత కొనసాగనుంది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు పడిపోవడమే దీనికి కారణం. మధ్య భారతదేశంపై పశ్చిమ ఆటంకాలు కొనసాగుతుండటంతో అక్కడ కనిష్ట

రాష్ట్రంలో మరో రెండు రోజులు చలి తీవ్రత కొనసాగనుంది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు పడిపోవడమే దీనికి కారణం. మధ్య భారతదేశంపై పశ్చిమ ఆటంకాలు కొనసాగుతుండటంతో అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడి నుంచి రాష్ట్రం వైపు వాయవ్య గాలులు వీస్తున్నాయి. ఇవి చలి గాలులు తీసుకొస్తున్నాయి. ఈశాన్య, తూర్పు గాలులను వాయవ్య గాలులు అధిగమిస్తూ చలి తీవ్రతను పెంచుతున్నాయని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. 2 నుంచి 4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు  నమోదవుతున్నాయి. మధ్య భారత దేశంపై ప్రభావం చూపుతున్న పశ్చిమ ఆటంకాలు రెండు రోజుల్లో కదలి వెళ్లిపోతాయని ఆ తర్వాత ఇప్పటికంటే చలి తీవ్రత తగ్గుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.