Hot Summer : ఇవేం ఎండలు రా నాయనా..! తెలుగు రాష్ట్రాల్లో 40డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, జూన్ వరకూ అగ్నిగుండమే..

మాడు పగిలిపోయేలా ఉన్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున.. అవసరమైతేనే బయటకు రావాలని వైద్యులు అంటున్నారు.

Hot Summer : ఇవేం ఎండలు రా నాయనా..! తెలుగు రాష్ట్రాల్లో 40డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, జూన్ వరకూ అగ్నిగుండమే..

Hot Summer

Hot Summer : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీల అధిక టెంపరేచర్ రికార్డ్ అయ్యింది. తెలంగాణలో 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రామగుండంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ లో 40 డిగ్రీలు, హైదరాబాద్ లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఇక ఏపీలోని కర్నూలు, విజయవాడ, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలోనూ 40 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయ్యింది. ఏపీలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు 42, తిరుపతి 41, నెల్లూరు, విజయవాడలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. 2016 తర్వాత ఈ ఏడాదే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

మాడు పగిలిపోయేలా ఉన్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున.. అవసరమైతేనే బయటకు రావాలని వైద్యులు అంటున్నారు. వడదెబ్బ బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెండు రోజులు వడగాలులు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు.

విశాఖ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.